Begin typing your search above and press return to search.
కృతిలో.. ఆ యాంగిల్ కూడానా?!
By: Tupaki Desk | 21 Nov 2015 5:01 AM GMTసీరియల్ కిస్సర్ గా పేరు తెచ్చుకొన్నాడు ఇమ్రాన్ హస్మీ. ఆయన సినిమా అనగానే కుర్రాళ్లు ఎంగిలి ముద్దుల్ని, ఘాటైన బెడ్ రూము సన్నివేశాల్ని ఊహించేస్తుంటారు. అందుకే దర్శకులు ఇమ్రాన్ హస్మీతో సినిమా తీసేటప్పుడు... ఆ కథ పెద్దగా డిమాండ్ చేయకపోయినా ఎక్కడో ఒకచోట కొన్ని ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్ని జోడించి తీరతారంతే. అందులో నటించే ప్రతీ కథానాయిక కూడా ముద్దులకీ, ఘాటైన సన్నివేశాలకీ సిద్ధపడే వస్తుంటుంది. ఇమ్రాన్ హస్మీ చిత్రాల్లో నటించేది ఎక్కువగా ఉత్తరాది భామలే కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఎదురు కావు. అయితే ఈసారి మాత్రం మన దక్షిణాది భామ ఇమ్రాన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైందట. ఆమె ఎవరో కాదు... కృతికర్బందా.
ఇప్పటిదాకా కృతి పద్ధతైన పాత్రల్లోనే కనిపించింది. దర్శకులు కూడా కృతి అనగానే పద్ధతిగా... మన పక్కింటి అమ్మాయిని పోలినట్టుగా పాత్రల్ని సృష్టిస్తుంటారు. కానీ హిందీ జనాలు మాత్రం మన కృతిలో రొమాంటిక్ యాంగిల్ ని చూసినట్టున్నారు. కృతిలాంటి ఫిగర్ ని రొమాంటిక్ సన్నివేశాల్లో చూపిస్తే ఇంకా నాచురల్ గా ఉంటుందన్న అభిప్రాయానికి వచ్చేశారట. అందుకే మహేష్‌భట్ నిర్మాణంలో రూపొందనున్న రాజ్4లో ఆమెని కథానాయికగా ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది.
రాజ్ సిరీస్ సినిమాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రొమాంటిక్ సన్నివేశాలు అదిరిపోతుంటాయంతే. ఆ తరహా సన్నివేశాల్ని చేయడానికి కృతి కూడా సిద్ధపడే రాజ్4లో నటించేందుకు ఒప్పుకొన్నట్టు తెలిసింది. ఇమ్రాన్ హస్మీ అందులో కథానాయకుడిగా నటించబోతున్నాడు కాబట్టి కృతి ముద్దులతో రెచ్చిపోనుందన్నమాట. కృతిలోని ఈ కొత్త యాంగిల్‌ని చూడాలని ఇప్పుడు దక్షిణాది కుర్రాళ్లు కూడా ముచ్చటపడిపోతున్నారు. కృతికర్బందాకి మాంచి కమర్షియల్ హీరోయిన్ కి ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఆమెకి ఇప్పటిదాకా ఒక్క కమర్షియల్ హిట్టు కూడా పడలేదు. అందుకే ఆమె ఇన్నాళ్లూ వెనకబడిపోయింది. ఇక హిందీలో తెరకెక్కనున్న ఈ ఘాటు సినిమాతోనైనా కృతి జోరు పెరుగుతుందేమో చూద్దాం!!