Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ పోల్ డాన్స్

By:  Tupaki Desk   |   3 July 2018 8:34 AM GMT
పవన్ హీరోయిన్ పోల్ డాన్స్
X
తెలుగులో ఎక్కువ సినిమాలు చేయకపోయినా హీరోయిన్ కృతి కర్బందా మనకు బాగా సుపరిచితురాలే. తీన్ మార్ లో పవన్ కళ్యాణ్ సరసన అమాయకమైన మధ్య తరగతి అమ్మాయి పాత్రలో కనిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒంగోలు గిత్త-ఓం త్రిడి అంటూ రెండు సినిమాలు చేసింది అవేవి ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో బాలీవుడ్ వెళ్లిపోయింది. రీ ఎంట్రీ పేరుతో రామ్ చరణ్ అక్కయ్యగా బ్రూస్ లీలో చేస్తే ఫలితం మారలేదు. కాకపోతే కృతి నటించిన కన్నడ సినిమాలు బాగానే ఆడటం తనకు రిలీఫ్. ప్రస్తుతం యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే తో పాటు కార్వాన్ లో నటించిన కృతి మరో కామెడీ ఎంటర్టైనర్ సైన్ చేసింది. అదే హౌస్ ఫుల్ 4.

ఇప్పటి దాకా ఈ సిరీస్ లో వచ్చిన మూడు సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా నవ్వించడమే కాదు వసూళ్లు కూడా బాగా రాబట్టాయి. అందుకే నిర్మాత సాజిద్ నడియడ్ వాలా నాలుగో భాగానికి రెడీ అవుతున్నాడు. ఇందులో కృతి గురించి అంత చెప్పుకోదగ్గ విశేషం ఏంటి అనుకుంటున్నారా. ఇందులో తన పాత్ర ప్రత్యేకంగా పోల్ డాన్స్ నేర్చుకోమని డిమాండ్ చేసిందట. అందుకే డైట్ మైంటైన్ చేస్తూ ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బాడీని మరింత ఫిట్ గా మార్చుకునే ప్రయత్నంలో ఉందని తెలిసింది. ఈ పోల్ డాన్స్ ఒక్క పాటకే పరిమితం కాదట.

కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో కృతి పాత్ర చేసీ పోల్ డాన్స్ కథలో కీలక భాగంగా ఉంటుందట. అందుకే ఇంత శ్రద్ధ వహించి పోల్ డాన్స్ నేర్చుకునే పనిలో పడింది కృతి. ఇంతకు ముందు ఎన్నడూ చేయని పాత్ర కావడంతో కృతి కూడా బాగా ఎగ్జైటింగ్ గా ఉంది. అక్షయ్ కుమార్ లాంటి సీనియర్ స్టార్ హీరో సరసన కావడంతో అది ఇంకాస్త రెట్టింపు అవుతోంది.