Begin typing your search above and press return to search.

గ్లామర్ గాలి గట్టిగా తగిలిందే

By:  Tupaki Desk   |   27 Oct 2017 6:17 AM GMT
గ్లామర్ గాలి గట్టిగా తగిలిందే
X
ప్రస్తుతం సినిమా అనే పాలిటిక్స్ లో హీరోయిన్స్ ఎన్నికల స్థానాలకు పోటీ ఎక్కువ అవ్వడంతో నటీమణులు అందాలతో ప్రేక్షక ఓటర్లను తెగ ఆకర్షిస్తున్నారు. స్టార్స్ నియోజక వర్గంలో స్థానం దక్కాలంటే బికినీ లో అయినా చీరలో అయినా కసిగా కనిపించి కుర్ర కారు ఓటర్లను వశపరచుకోవాలి. నటించిన సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా ఈ రోజుల్లో హీరోయిన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఎక్కడ కనిపించినా స్టయిలిష్ లుక్ తో కనిపించి స్టార్ హీరోయిన్స్ లెవెల్ లో రెచ్చిపోతున్నారు.

ఇక సోషల్ మీడియాలో అయితే అందాల ప్రదర్శనతో ప్రచారం బాగానే చేసుకుంటున్నారు. మొన్నటి వరకు అమాయకపు చూపులతో కనిపించిన ఇన్నోసెంట్ భామలు ఇప్పుడు కూడా కసి చూపులతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు. ఇటీవల కృతి ఖర్బందా కూడా అదే రేంజ్ లో తన అందాలతో మతి పోగొడుతోంది. మొన్నటి వరకు హోమ్లీగా కనిపించిన ఈ భామ ఎప్పుడైతే ఛాన్సులు తక్కువయ్యాయో అప్పటి నుండి సెక్సీ లుక్స్ లో కనిపించడం స్టార్ట్ చేసింది.

దానికి తోడు నార్త్ గాలి కొంచెం తగలడంతో గ్లామర్ డోస్ బాగా పెంచేసింది. రీసెంట్ గా సోషల్ మీడియాలో అమ్మడు ఒక సెక్సీ ఫిక్ పోస్ట్ చేసింది. క్లివేజ్ షోతో స్టయిలిష్ హెయిర్ తో సెక్సీ పెదాలతో కనిపించి వైరల్ అవుతోంది. ప్రస్తుతం అమ్మడు బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. మరి ఎంతవరకు ఈ అందాలు ఉపయోగపడతయో చూడాలి.