Begin typing your search above and press return to search.

ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందట.. అతడితో డేట్ కు వెళుతుందట

By:  Tupaki Desk   |   21 Aug 2021 4:18 AM GMT
ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటుందట.. అతడితో డేట్ కు వెళుతుందట
X
కాలం మారిపోయింది. అడగాలే కానీ మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. అదేం తప్పు కాదు. మనసులో ఒక మాట.. అందుకు భిన్నంగా చెప్పే మాటను తప్ప పట్టాలి కానీ ఓపెన్ గా మాట్లాడటంలో తప్పేం లేదు. కాకుంటే.. కొన్ని విషయాల్లో హద్దుల గీతలు గీసుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం కలుగక మానదు. కానీ.. ఇలాంటివి పాత చింతకాయ పచ్చడిగా కొట్టేసేవారే ఎక్కువ.

గతంలో మీకు ఇష్టమైన హీరో ఎవరంటే.. చెప్పటానికి చాలా ఇబ్బంది పడేవారు హీరోయిన్లు. చాలా హిపోక్రటిక్ సమాధానాలు ఇచ్చేవారు. మరికాస్త డీప్ గా అడిగితే.. మీకు తెలుసు కదండి.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో. ఫలానా హీరో ఇష్టమంటే మరో హీరోకు మండుతుంది. అలాంటప్పుడు ఓపెన్ గా సమాధానం చెప్పలేదు కదా? అర్థం చేసుకోమని పాత్రికేయులతో చెప్పేవారు. ఇప్పుడు అలాంటివి పట్టించుకోకుండా మనసుకు అనిపించింది ఓపెన్ గా చెప్పేయటం ఎక్కువైంది.

తాజాగా సన్నజాజి మొగ్గలాంటి కృతీ సనన్‌ ను ఒక ఇంటర్వ్యూలో చిలిపి ప్రశ్నలు వేస్తే.. వాటికి ఏ మాత్రం మొహమాటం లేకుండా ఆమె ఉన్నది ఉన్నట్లు చెప్పేశారు. మీకు పెళ్లి చేసుకునే అవకాశం లభిస్తే హీరోల్లో ఎవరిని పెళ్లి చేసుకుంటారు? డేట్ కు ఎవరితో వెళతారు? ఎవరిని ఫ్లర్ట్ చేస్తారు? అని అడిగారు. ప్రశ్న ఎంత సూటిగా ఉందో.. సమాధానం అంతే సూటిగా చెప్పేసింది కృతీ.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అయిన ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె.. డేట్ విషయంలో మాత్రం టైగర్ ష్రాఫ్ తో వెళతానని చెప్పింది. ఇక.. ఫ్లర్ట్ష్ చేసే విషయంలో మాత్రం.. కార్తీక్ ఆర్యన్ తో అని సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఆదిపురుష్ లో ప్రభాస్ తో జత కట్టిన కృతీ సనన్ మాట ఆసక్తికరంగా మారింది.