Begin typing your search above and press return to search.
ప్రభాస్ పై ఆ ముద్రను చెరిపేసిన ఆమె కామెంట్స్
By: Tupaki Desk | 16 July 2021 8:31 AM GMTమిర్చికి ముందు వరకు ప్రభాస్ అంటే తెలుగు హీరో. కాని బాహుబలి తర్వాత ఆయన ఒక్కసారిగా స్టార్ అయ్యాడు. తెలుగు లో ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ఇతర భాషల్లో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. సెలబ్రెటీలు కూడా ప్రభాస్ అభిమానుల జాబితాలో ఉంటారు అనడంలో సందేహం లేదు. ఇక ప్రభాస్ కు మొదటి నుండి కూ డా మొహమాటస్తుడు అనే టాక్ ఉంది. ఆయన సహజంగా ఎక్కువగా నలుగురిలో కలవడు.. తన వారితో మాత్రమే సన్నిహితంగా ఉంటాడు. కొత్త వారితో మాట్లాడేప్పుడు ముడుచుకు పోయినట్లుగా ఉంటాడు అంటూ కామెంట్స్ విపిస్తాయి.
ఇక హీరోయిన్స్ రొమాన్స్ విషయంలో చాలా మొహమాటస్తుడు అని కూడా అంటూ ఉంటారు. స్నేహితులతో మాత్రమే సన్నిహితంగా ఉంటూ కొత్త వారితో పెద్దగా అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తాడు అనేది కామెంట్స్. కాని ఈమద్య కాలంలో కొందరు మాత్రం ప్రభాస్ తీరు మారిందని అంటున్నారు. ప్రభాస్ మొహమాటస్తుడు. కాని అది ఒక మేరకు మాత్రమే అని... ఆయన తీరు నాకు చాలా నచ్చిందని తాజాగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా లో సీత పాత్రను కృతి సనన్ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఆది పురుష్ సినిమా లో హీరోయిన్ గా ఈమె ప్రభాస్ తో కలిసి నటిస్తున్న కారణంగా మొదటి సారి ప్రభాస్ తో ఆమెకు స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం దక్కింది. ప్రభాస్ తో ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి నాకు చాలా మంది మొహమాటస్తుడు అని చెప్పారు. పెద్దగా మాట్లాడడు అని కూడా చాలా మంది నాతో అన్నారు. కాని వారు చెప్పిన దానికి పూర్తి విరుద్దంగా ఉన్నాడు. ఆయన మొహమాటస్తుడు అనే మాట నిజం కాదు. ఆయన ఒక్క సారి మాట్లాడితే చాలా మాట్లాడుతారు. పలు విషయాలను ఆయన షేర్ చేసుకుంటూ ఉంటారు.
మొదట హాయ్ అని చెప్పినప్పుడు కాస్త మొహమాటంగా అనిపించినా ఆ తర్వాత ఆయన తీరు పూర్తిగా మారిపోయింది. ఒకసారి పరిచయం అయిన తర్వాత ఆయన అత్యంత ఆత్మీయంగా మాట్లాడుతారు. ప్రభాస్ మంచి మాటకారి అని.. ఆయన సెన్సాఫ్ హ్యూమర్ అద్బుతం అంటూ కృతి సనన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడి మాటలతో ప్రభాస్ గురించి మొదటి నుండి ఉన్న మొహమాటస్తుడు మరియు సిగ్గరి అనే ముద్ర చెరిగి పోయింది. గతంలో సాహో హీరోయిన్ శ్రద్ద కపూర్ కూడా ప్రభాస్ కు సన్నిహితంగా ఉండేది. ఆమె అత్యంత సన్నిహితురాలిగా ప్రభాస్ కు మెలిగింది. ఇప్పటికి కూడా ఇద్దరి మద్య స్నేహం కొనసాగుతుంది. ఇద్దరి మద్య రొమాంటిక్ సీన్స్ కూడా బాగా వచ్చాయి.
ఇక ఆదిపురుష్ సినిమా కోసం తెలుగు.. హిందీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని భాషల ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. ప్రభాస్ మరో వైపు రాధే శ్యామ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా ను చేస్తున్నాడు. ఆ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు అన్ని కూడా పాన్ ఇండియా మూవీస్ గా రూపొందుతున్నాయి. కనుక ఆయనతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కూడా నటించేందుకు సిద్దం అంటున్నారు.