Begin typing your search above and press return to search.

నాపై రూమర్లు టివి సీరియల్స్ లా ఉన్నాయ్

By:  Tupaki Desk   |   9 Jun 2017 5:11 AM GMT
నాపై రూమర్లు టివి సీరియల్స్ లా ఉన్నాయ్
X
కృతి సనోన్ ఇప్పుడు బాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇండస్ట్రి అమ్మాయి కాకపోయినా వచ్చిన మూడు నాలుగు ఏళ్ళులోనే ఇక్కడ ఎలా ఉండాలో.. స్టార్స్ పై వచ్చిన విమర్శలును ఎలా అర్ధం చేసుకోవాలో.. వాటిని ఎలా తిప్పికొట్టాలో బాగానే అర్ధంచేసుకుంది. ఈమె నటిస్తున్న ‘రాబ్తా’ మూవీ ఈరోజు విడుదల కాబోతుంది. ఈ సినిమాలోని హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో కాస్త శృతి మించి లవ్ సీన్స్ లో నటించింది అనే విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా.. అతనితో ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్లు వస్తున్న వేళ.. అమ్మడే ఏమందో తెలుసా?

“జనాలు చాల సార్లు స్టార్స్ కూడా సాధారణమైన మానుషులే అని మరిచిపోతుంటారు. వాళ్ళకు కూడా ఒక ఫ్యామిలి ఉంటుందిని వాళ్ళకు స్నేహితులు ఉంటారని గుర్తుపెట్టుకోరు. ఇండస్ట్రిలో సహజమైన రూమర్ల గురించి నేను ఇప్పుడు ఆలోచించటం లేదు. ఇప్పుడు నా పైన వస్తున్న లింక్ అప్స్ గురించి రోజుకో కథ వింటున్నాను. రోజు చూసే టి‌వి సీరియల్స్ లా వాటిని ఎంజాయ్ చేస్తున్నా. రోజుకో కొత్త యాంగిల్ వినిపిస్తోంది'' అని తీసిపారేసింది. మనకు నచ్చిన మనిషితో బయటకు వెళ్ళటం లంచ్లు చేయటం తప్పేమీ కాదు కదా.. దాన్నే మీరు లింకప్ గా మారిస్తే ఎలా అనేస్తుంది అమ్మడు.

దినేష్ విజాన్ డైరెక్ట్ చేస్తున్న రాబ్తా సినిమా ఈరోజు థియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటివరకు బాలీవుడ్ లో కృతి సనోన్ కు క్రేజ్ ఉంది కాని సాలిడ్ హిట్ మాత్రం లేదు. ఒకవేళ ఈ సినిమా హిట్టయ్యిందంటే అమ్మడి రేంజు మారిపోతుంది. చూద్దాం ఏమవుతుందో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/