Begin typing your search above and press return to search.

టాలీవుడ్ స్టార్ సీక్రెట్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!

By:  Tupaki Desk   |   15 Sep 2022 11:30 PM GMT
టాలీవుడ్ స్టార్ సీక్రెట్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ!
X
టాలీవుడ్ స్టార్ హీరో ప్ర‌భాస్ ది ఎంత ఎదిగినా ఒదిగి వుండే మ‌న‌స్త‌త్వం. 'బాహుబ‌లి' సిరీస్ తో వ‌ర‌ల్డ్ వైడ్ గా క్రేజీగా ఫ్యాన్‌ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్నా కూడా ప్ర‌భాస్ లో కించిత్ గ‌ర్వం, ద‌ర్పాన్ని చూపించుకోవాల‌నే కుతూహ‌లం ఎక్క‌డా క‌నిపించ‌దు. అందుకే ఆయ‌న‌ని డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌నాలిటీ అని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలే కాకుండా ఫ్యాన్స్, వ్య‌క్తి గ‌తంగా ఆయ‌న గురించి తెలిసిన వాళ్లు ముక్త‌కంఠంతో ప్ర‌శంస‌లు కురిపిస్తుంటారు.

రీసెంట్ గా ప్ర‌భాస్ పెద‌నాన్న రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెందిన విష‌యం తెలిసిందే. క‌డ‌సారి కృష్ణంరాజుని చూడాల‌ని ఆయ‌న అభిమానుల‌తో పాటు ప్ర‌భాస్ అభిమానులు భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ఇంత విషాదంలో కూడా వారికి ప్ర‌భాస్ భోజ‌నం ఏర్పాట్లు చేయించ‌డం ప‌లువురిని క‌దిలించింది.

ఆయ‌న వ్య‌క్తిత్వం ఎంత గొప్ప‌దో మ‌రోసారి ర‌జువు చేసింది. ఇదిలా వుంటే హీరో ప్ర‌భాస్ పై బాలీవుడ్ హీరోయిన్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు పలువురిని ఆక‌ట్టుకుంటున్నాయి.

తాజాగా ఓ బాలీవుడ్ మీడియాతో హీరోయిన్ కృతిస‌న‌న్ మాట్లాడుతూ ప్ర‌భాస్ పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌భాస్ తో క‌లిసి కృతిస‌న‌న్ భారీ మైథ‌లాజిక‌ల్ మూవీ 'ఆది పురుష్'లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కృతిస‌న‌న్ మాట్లాడుతూ 'నేను సెట్స్ లో ప్ర‌భాస్ ను తొలిసారి చూసిన‌ప్పుడు త‌ను సిగ్గుప‌డ్డారు. అంత‌రూ ఎందుకు ఆయ‌న‌ని షై ప‌ర్స‌న్ అని పిలుస్తారో అప్పుడు నాకు తెలిసింది.

అయితే షాట్ బ్రేక్ లో నేను ప్ర‌భాస్ ని క‌లుసుకున్న త‌రువాత వెంట‌నే నాతో ఫ్రీగా మాట్లాడ‌టం మొద‌లు పెట్టాడు. త‌ను ఇంత త్వ‌ర‌గా నాతో ఫ్రీగా మాట్లాడి క‌లిసిపోతాడ‌ని నేను ఊహించ‌లేదు. దాంతో ప్ర‌భాస్ మాట్లాడ‌గానే ముందు ఆశ్చ‌ర్య‌పోయాను. నిజంగా ప్ర‌భాస్ ఓ స్వీట్ ప‌ర్స‌న్‌. అలాంటి వ్య‌క్తితో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా ఆనందంగా వుంది' అని తెలిపింది.

అంతే కాకుండా 'ఆదిపురుష్‌'లోని సీత పాత్ర‌లో న‌టించ‌డానికి ఇబ్బందిప‌డుతుంటే ప్ర‌భాస్ హెల్ప్ చేశార‌ని, డైలాగ్ డిక్ష‌న్ విష‌యంలో ప్ర‌భాస్ స‌హ‌క‌రించారని వెల్ల‌డించింది. భారీ స్థాయిలో 3డీ ఫార్మాట్ లో రూపొందిన 'ఆది పురుష్‌' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి జ‌న‌వ‌రి 12న విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.