Begin typing your search above and press return to search.

ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా బ్యూటీ

By:  Tupaki Desk   |   1 Sep 2017 2:07 PM GMT
ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా బ్యూటీ
X

వెండి తెరపై హాట్ లుక్స్ లో కనిపించే హీరోయిన్స్ ని చాలామంది డబ్బుల కోసమే వారు అలా చేస్తారు అనుకుంటారు. ముఖ్యంగా వారికి ఏ దారి దొరక్కపోవడంతో కాస్త అందంగా ఉండేసరికి కథానాయికలుగా మరారని కామెంట్స్ కూడా వినిపిస్తాయి. అయితే చాలా మంది హీరోయిన్స్ లలో కూడా డిగ్రీలు -గోల్డ్ మెడల్ లు సాధించినవారు కూడా ఉంటారని చాల తక్కువమందికే తెలుసు. హీరోయిన్స్ కూడా వారి వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా చెప్పుకోరు. వాటి గురించి కూడా ఎక్కువగా ఎవరు అడగరు.

కానీ మొదటి సారిగా ఇండియాకి చెందిన ఒక బెస్ట్ గ్రాడ్యుయేట్ హీరోయిన్ మరొక దేశానికి ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు నిర్వహించడానికి రెడీ అయిపొయింది. ఆమె ఎవరో కాదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ "1 నేనోక్కడినే" సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన కృతి సనోన్. ఈ అమ్మడు అందంతోనే కాదు చదువులోనూ చాలా బెస్ట్. అమ్మానాన్నా విద్యావంతులు కావడం వల్ల ఆమె కూడా స్టడీ లో ఇంజనీరింగ్ పట్టా అందుకుంది. అంది కూడా 90% పైన మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత మోడలింగ్ లో క్రేజ్ సంపాదించుకొని ప్రస్తుతం హీరోయిన్ గా రాణిస్తోంది.

అయితే న్యూజిలాండ్ దేశం వారు ఈ అమ్మడి అర్హతకీ అందానికీ ఫిదా అయిపోయి ఎడ్యుకేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు చెప్పారు. రీసెంట్ గా బరేలి కి బర్ఫీ అనే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడి స్టార్ హోదాను కూడా వారు పరిగణలోకి తీసుకున్నారట. తమ దేశంలో ఎడ్యుకేషన్ సంస్థలు చాలా ఉన్నాయని కృతి ప్రచారకర్తగా ఉండడం వల్ల లాభం చేకూరుతుందనే నమ్మకం వారికి ఉందని చెప్పారు. ఈ అమ్మడు కూడా తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని చెప్పింది.