Begin typing your search above and press return to search.
బొద్దుగుమ్మ అయ్యేందుకు అలా చేస్తోందట
By: Tupaki Desk | 4 Feb 2020 12:30 AM GMTసుకుమారంగా కనిపించటం అంత తేలికైన విషయం కాదు. వెండితెర మీద వెలిగిపోయేందుకు హీరోయిన్లు ఎంత కష్టపడతారో.. నోటికి తాళం వేసుకొని ఎన్ని ఇబ్బందులు పడతారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. తినే కాసింత తిండిని.. దాని ద్వారా వచ్చే క్యాలరీలు కరిగించుకునేందుకు గంటల కొద్దీ సమయాన్ని జిమ్ లో కష్టపడటమే కాదు.. పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది బక్కపల్చటి భామ తాజాగా బొద్దుగుమ్మగా మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
సినిమాలో తనకు వచ్చిన పాత్రకు న్యాయం చేసేందుకు ఇటీవల కాలంలో హీరోలు.. హీరోయిన్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. గతంలో ఒక పాత్ర కోసం ఇంతగా శ్రమించేవారు కాదు. కానీ.. మారిన కాలంతో పాటు.. నటీనటుల శ్రమ కూడా బాగా పెరిగింది. ఇప్పుడా కోవకే వస్తారు కృతి సనన్. సన్నగా రివాటుగా ఉండి.. మెరుపు తీగ అందంతో ప్రేక్షకుల మదిని దోచిన భామ తెలుగులో చేసింది తక్కువే. బాలీవుడ్ కు వెళ్లి.. అక్కడ కూడా సక్సెస్ ఫుల్ మూవీస్ చేస్తున్న ఆమెకు తాజాగా ఒక మరాఠీ మూవీలో ఛాలెంజింగ్ రోల్ వచ్చింది.
మాలా ఐ వైచై అన్న మరాఠా మూవీ హిందీలో తీస్తున్నారు. దీన్లో తొలుత నర్తకిగా.. సినిమా ముగింపు సమయానికి సరోగసి తల్లిగా కనిపిస్తుంది. ఈ పాత్రకు నూటికి నూరు మార్కులు వేయించుకోవటం కోసం ఈ బక్కపల్చటి భామ బొద్దుగా తయారయ్యేందుకు రెఢీ అవుతోంది. తాను ఉన్న బరువుకు ఏకంగా పదిహేను కేజీలు పెరిగేందుకు ప్రణాళిక వేసుకొని మరీ లావు అయ్యే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తిగా చేపట్టింది.
నిత్యం జిమ్ లో వర్క్ వుట్ చేసే ఆమె.. వాటిని ఆపేసి సుష్టుగా లాగించేస్తోంది. పొద్దున్నే ఏ హీరోయిన్ కూడా తినని పూరీ.. శనగల కర్రీతో పాటు.. హల్వానూ లాగించేస్తూ.. త్వరగా లావు కావాలని విపరీతంగా ప్రయత్నిస్తోందట. ఈ విషయం తెలిసిన తర్వాత సోషల్ మీడియాలో కృతి సనన్ మీద నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి ఫుడ్ తినే ఏకైక హీరోయిన్ ఆమె మాత్రమే అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.