Begin typing your search above and press return to search.

కృతికు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడుగా..

By:  Tupaki Desk   |   8 Aug 2015 6:32 AM GMT
కృతికు బాయ్‌ ఫ్రెండ్‌ ఉన్నాడుగా..
X

హీరోలు తమ గాళ్ ఫ్రెండ్స్ ని హీరోయిన్స్ చేయడం, తమకు నచ్చిన వారిని ఛాన్సులిప్పించడంలో ముందుంటారు. అడపా దడపా హీరోయిన్స్ కూడా ఇలాంటివి చేస్తుంటారు. అయితే అసలు ఫిలిం ఇండస్ట్రీ తో పరిచయం లేని వ్యక్తులను... కేవలం స్టార్స్ రిఫరెన్స్ ఇవ్వడంతోనే హీరోలుగా అవతరించడం మాత్రం అరుదుగా జరిగేదే.

గౌరవ్ అరోరా.. ఈ పేరు చెబితే ఎవరికీ పెద్దగా తెలీకపోవచ్చు కానీ... కృతి సనన్ బాయ్ ఫ్రెండ్ అంటే మాత్రం కొంతమందికి గుర్తుకొస్తాడు. ఈ కుర్రాడి తో కృతి చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తీరు అలా ఉంటుంది మరి. పబ్బుల నుంచి ప్రోగ్రాముల వరకూ.. ఈవెంట్స్ నుంచి ఇంటిమేట్ గా కనిపించేవరకూ వీళ్లిద్దరి చక్కర్ల సంగతి బాలీవుడ్ మొత్తానికి తెలుసు.

ఇతగాడికి మర్డర్ సిరీస్ లో నటించేందుకు ఛాన్స్ వచ్చినట్లు బాలీవుడ్ టాక్. అంతా కృతి సనన్ పుణ్యమే. భట్ ఫ్యామిలీని ఈ విషయంపై ఒప్పించేందుక కృతి బాగా కృషి చేసిందట. బాగుంది కానీ అమ్మడూ... ఆ సిరీస్ లో చేసిన జంటలు... లవర్స్ అయిపోయిన హిస్టరీ ఉంది. జర జాగ్రత్త.