Begin typing your search above and press return to search.
ఈవిడ ఊపుడు అందరికీ నచ్చిందిట
By: Tupaki Desk | 3 Jan 2016 6:55 AM GMTస్కిల్స్ అనేవి లోన దాగి ఉన్నంత కాలం ఎవరినుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాదు. ఏదో ఒకరోజు వాటిని బైట పెట్టాల్సిందే. ముఖ్యంగా వేదికలపై తనదైన ప్రతిభ ప్రదర్శించినప్పుడు వచ్చే గుర్తింపే వేరుగా ఉంటుంది. మామూలుగా వెండితెరపై కనిపించినప్పటికీ, స్టేజీ మీద స్పాంటేనియస్గా చేసి చూపించిన దానికి బోలెడంత వేరియేషన్ ఉంటుంది. ఈ రెండు కోణాల్లోనూ తనని తాను నిరూపించుకుంది కృతి సనోన్. 1 నేనొక్కడినే చిత్రంలో అవకాశం వచ్చినా మరీ అంత అందంగా లేదే అన్నవాళ్లే ఆ తర్వాత తన పెర్ఫామెన్స్ చూసి, అబ్బో అన్నారు.
మొన్నటికి మొన్న బాద్షా షారూక్ ఖాన్ - కాజోల్ జంటగా నటించిన సినిమాలో వరుణ్ ధావన్ సరసన క్యూట్ లవర్ లా నటించి అందరి మనసులు దోచింది. కృతి సనోన్ అంటే బండిల్స్ ఆఫ్ ట్యాలెంట్. తొలి సినిమా హీరో ప్యాంటీతోనే వీరాభిమానుల్ని సంపాదించుకున్న ఈ అమ్మడు మలి సినిమాతో ఓ రేంజులో ఫ్యాన్స్ ని తెచ్చుకుంది. అయితే తనలో ఏదో అసంతృప్తి. బెల్లీ - జెల్లీ - సాల్సా - హిప్ హాప్ లాంటి డ్యాన్సుల్లో ఎంత ప్రావీణ్యం ఉన్నా నిన్నటివరకూ వాటిని చూపించుకునే ఛాన్సే దక్కలేదు.
అయితే ఇటీవలే స్టార్ గిల్డ్ అవార్డుల వేడుక కోసం వేదికనెక్కిన అమ్మడు తన డ్యాన్స్ మూవ్స్ అన్నిటినీ బైటికి తీసింది. ఇవి చూసిన వాళ్లంతా అవాక్కయ్యారుట. ఆ మూవ్స్ కి ఫ్రెండ్సుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ సైతం షాక్ తిన్నారుట. ఇంత బేషుగ్గా డ్యాన్సులు చేయగలదని మేం ఎన్నడూ ఊహించిందే లేదు. అంటూ అంతా ఫోన్ లు చేసి మరీ కాంప్లిమెంట్స్ ఇచ్చేశారుట. ఈ సంగతిని ఢిల్లీ బ్యూటీ కృతి స్వయంగా చెప్పేసింది మరి. ఇలా అవార్డు వేడుకల్లో డ్యాన్సులు చేయడం ఇదే తొలిసారి. చాలా ఎగ్జయిటింగ్ అనిపించింది. హీరో ప్యాంటీ మూవీలో పాటలకు స్టెప్పులేశాను. అందరి నుంచి చక్కని ప్రశంసలొచ్చాయి అని చెప్పింది కృతి.