Begin typing your search above and press return to search.
ప్రభాస్ ని పెళ్లాడుతున్న కృతి సనోన్.. నిజమెంత?
By: Tupaki Desk | 30 Nov 2022 4:10 AM GMTఆరడుగుల ఆజానుబాహుడు.. అందగాడు అయిన ప్రభాస్ తో పలువురు కథానాయికల ఎఫైర్ వార్తలు నిరంతరం చూస్తున్నవే. ఇటీవలి కాలంలో ఆదిపురుష్ కోస్టార్ కృతి సనోన్ తో ప్రభాస్ ప్రేమలో ఉన్నారని ప్రచారమవుతోంది.
ప్రభాస్ అంటే కృతి సనోన్ పడి చస్తోందని అతడిని పెళ్లాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టేట్టు లేదని కూడా మీడియాలో కథనాలు వైరల్ అయ్యాయి. అయితే మీడియా గుసగుసలపై వీరిద్దరూ ఎప్పుడూ స్పందించలేదు.
కానీ ఇటీవల భేదియా ప్రచారంలో వరుణ్ ధావన్ చేసిన కామెంట్ తో కృతి నిజంగానే డార్లింగ్ తో ప్రేమలో ఉందని అంతా భావించారు. ''కృతి జీవితంలోకి డార్లింగ్ వచ్చాడు!'' అంటూ వరుణ్ సూటిగా వ్యాఖ్యానించడంతో అది కాస్తా ప్రభాస్ అభిమానుల్లో షివరింగ్ పుట్టించింది.
ఇది నిజమా? అంటూ అందరూ సందేహించారు. తమ ఫేవరెట్ హీరో తన బ్యాచిలర్ షిప్ ని విడిచిపెట్టే సమయం ఆసన్నమైందని కూడా కొందరు అభిమానులు భావించారు.
అయితే ఈ పుకార్లు ఊహాగానాలపై కృతి సనన్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కథనాలన్నీ నిరాధారమని పేర్కొంది. కృతి మాట్లాడుతూ-''ఇది ప్యార్ లేదా PR కాదు. మా భేదియా ప్రచారం కోసం ఒక రియాల్టీ షోలో వరుణ్ ధావన్ కొంచెం ఓవర్ చేసాడు.
అతని సరదా పరిహాసం ఇలాంటి పుకార్లకు దారి తీస్తుంది. కొన్ని వెబ్ సైట్లు నా పెళ్లి తేదీని ప్రకటించే ముందు... మీ సందేహాలను తీర్చనివ్వండి..'' అంటూ వ్యాఖ్యానించింది. అంతేకాదు.. అభిమానుల ఉబ్బిపోతున్న బుడగ(పొట్ట)ను పగలగొట్టనివ్వండి అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది. ఈ పుకార్లు పూర్తిగా నిరాధారమైనవని కృతి తన అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేసింది.
ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా కృతి సీత పాత్రలో నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అద్భుతంగా పండిందని కథనాలొచ్చాయి. అంతేకాదు సెట్స్ లో ప్రభాస్ మునుపెన్నడూ లేనంత జోష్ తో కృతితో కలిసి పోయాడని గుసగుసలు వినిపించాయి. ఇక ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ పౌరాణిక డ్రామాకు పురాణేతిహాసం రామాయణం స్ఫూర్తి. అందులో రాముని పాత్రను సీత పాత్రను రావణుడి పాత్రను అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారని సమాచారం. ఇందులో సైఫ్ అలీ ఖాన్ రావణ్ పాత్రలో నటించారు. 16 జూన్ 2023న ఈ మూవీ విడుదల కానుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.