Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : మిస మిస మెరుపుల మెహబూబా..!

By:  Tupaki Desk   |   14 Dec 2022 1:30 PM GMT
ఫోటో స్టోరీ : మిస మిస మెరుపుల మెహబూబా..!
X
బాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్స్ లిస్ట్ లో ప్రస్తుతం కృతి సనన్ ఉంటుందని చెప్పొచ్చు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన కృతి సనన్ ఇక్కడే చైతన్య హీరోగా దోచెయ్ సినిమా కూడా చేసింది. బాలీవుడ్ లో మొదట్లో తనని ఎవరు పట్టించుకోలేదు కానీ ఆ తర్వాత అమ్మడి టాలెంట్ కి అందరు ఫిదా అయ్యారు.

తన నటనతో బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తూ వచ్చిన కృతి సనన్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సీతగా నటిస్తుంది. ఆ సినిమాపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే బాలీవుడ్ లో కృతి పేరు మారు మ్రోగుతుండగా ఆదిపురుష్ తో ఆమె మరింత రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం హిందీ పరిశ్రమలో కృతి హవా నడుస్తుందని చెప్పొచ్చు.

కేవలం కమర్షియల్ సినిమాలే కాదు డిఫరెంట్ సినిమాలు కూడా చేస్తూ అలరిస్తుంది అమ్మడు. ఇక సినిమాలతో పాటు ఫ్రీ టైం లో ఫోటో షూట్స్ కూడా చేస్తుంది. కృతి సనన్ లేటెస్ట్ ఫోటో షూట్ ప్రేక్షకులను వెర్రెక్కేలా చేస్తుంది. అసలే చలికాలం ఈ టైం లో కృతి సనన్ హాట్ ఫోటో షూట్ ఆమె ఫాలోవర్స్ ని ఫిదా అయ్యేలా చేస్తుంది. లేటెస్ట్ ఫోటో షూట్ లో వైట్ కలర్ మోడ్రెన్ డ్రెస్ లో గ్లామర్ ఫోజుతో రచ్చ చేస్తుంది కృతి.

వెనక లైటింగ్.. అమ్మడి అందాల వాక్ స్టైల్.. ఆ ఫోటో షూట్ కే హైలెట్ అయ్యేలా నిలిచాయి. కృతి సనన్ చేస్తున్న ఈ ఫోటో షూట్ అమ్మడికి మరింత మైలేజ్ తెచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. బాలీవుడ్ లో ఫుల్ బిజీ షెడ్యూల్ తో ఉన్న కృతికి ప్రస్తుతం తెలుగు ఆఫర్లు వస్తున్నా ఆమె కాదనక తప్పట్లేదు. మొత్తానికి మహేష్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి సనన్ మన హీరోలు అవకాశం ఇచ్చినా చేసే వీలులేదన్నట్టు చెప్పుకొస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.