Begin typing your search above and press return to search.

మిస్టేకెన్ కాదు.. కృతి మిస్ టేకెన్..

By:  Tupaki Desk   |   26 Sep 2016 2:17 PM GMT
మిస్టేకెన్ కాదు.. కృతి మిస్ టేకెన్..
X
సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి 1 నేనొక్కడినే మూవీలో ఆడిపాడి సాహసాలు చేసిన కృతి సనోన్.. ఇప్పుడు బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయిపోయేందుకు ట్రై చేస్తోంది. ఇప్పటికే హీరోపంటి.. దిల్వాలే చిత్రాలలో నటించగా.. ఈమెకు గుర్తింపు వచ్చింది కానీ.. సక్సెస్ లు మాత్రం ఖాతాలో పడలేదు. అయితే.. ఈమెకు క్రేజ్ మాత్రం వీర లెవెల్ లో పెరిగిపోతోంది.

మిస్ టేకెన్ అంటూ ఓ కొత్త మేగజైన్ ను స్టార్ట్ చేయనుండగా.. ఇది బేసిక్ గా లేడీస్ ను టార్గెట్ చేసిన మేగజైన్. అందుకే.. రకరకాల కొత్త వర్డింగ్స్ తో ప్రయోగాలు చేస్తుండగా.. డిఫరెంట్ గా పోజులిచ్చి.. అందంగా తయారైపోయింది కృతి. గాళ్స్ విల్ బీ గాల్స్ అనే ట్యాగ్ లైన్ కు తగ్గట్లుగా కుర్రాళ్లను రెచ్చగొట్టే పోజులు ఇవ్వండంతో పాటు.. మిస్ చీఫ్.. మిస్ బిహేవ్.. లాంటి పదాలను డిఫరెంట్ గా ఉపయోగించడం ఆసక్తిని కలిగిస్తోంది.

ఓ కొత్త మేగజైన్ లాంఛింగ్ ఎడిషన్ కి కృతి సనోన్ ను కవర్ గాళ్ గా తీసుకున్నారంటేనే.. ఈ భామ రేంజ్ బాలీవుడ్ లో ఏ రేంజ్ లో వెలిగిపోతోందో అర్ధమవుతుంది. ఇక సినిమాల సంగతి చూస్తే.. రాబ్టా అనే మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉండగా.. ఇందులో ఎంఎస్ ధోనీ- ది అన్ టోల్డ్ స్టోరీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో రొమాన్స్ చేయనుంది కృతి సనోన్.