Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ లో ప్ర‌భాస్ హీరోయిన్ జిల్ జిల్ జిగేల్!

By:  Tupaki Desk   |   15 Sep 2021 1:30 PM GMT
వైట్ అండ్ వైట్ లో ప్ర‌భాస్ హీరోయిన్ జిల్ జిల్ జిగేల్!
X
ముందు టాలీవుడ్ లో తెరంగేట్రం చేయ‌డం ఆ త‌ర్వాత‌ బాలీవుడ్ ని ఏలేయ‌డం హీరోయిన్ల‌కు సెంటిమెంట్ గా మారిన‌ట్టుంది. వైజ‌యంతి మాల నుంచి నిన్నటి ప్రియాంక చోప్రా (అపురూపం-2005.. రిలీజ్ కాలేదు) వ‌ర‌కు తెలుగులో ప‌రిచ‌య‌మై ఆ త‌రువాత బాలీవుడ్ ని ఏలిన వారే. అదే ఫార్ములాని పాటించిన కృతి స‌న‌న్ టాలీవుడ్ లో ముందుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మ‌హేష్ తో సుకుమార్ చేసిన `1 నేనొక్క‌డినే` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించింది.

ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో `ప‌రుగు` ఆధారంగా తెర‌కెక్కిన రీమేక్ `హీరో పంటీ`తో బాలీవుడ్ బాట ప‌ట్టేసింది. ఆ త‌రువాత ఇంకేముంది ఈ మూవీ ఆమె కెరీర్ ని బాలీవుడ్ లో ప‌రుగులు పెట్టించింది. క్రేజీ స్టార్‌ల చిత్రాల్లో న‌టించే అవ‌కాశాల్ని వ‌రుస‌గా ద‌క్కించుకుంటూ క్రేజీ హీరోయిన్‌ల ఆబితాలో చేరిపోయింది. ప్ర‌స్తుతం క్రేజీ చిత్రాల్లో న‌టిస్తూనే ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్‌`లో సీత‌గా న‌టించే అవ‌కాశాన్ని దక్కించుకుని అందిరి దృష్టిని ఆక‌ర్షించింది.

ఓమ్ రౌత్ అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిస్తున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. రామాయ‌ణ గాథ నేప‌థ్యంలో భారీ గ్రాఫిక్స్ నేప‌థ్యంలో స‌రికొత్త పంథాలో అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ మూవీతో వార్త‌ల్లో నిలుస్తున్న కృతి స‌న‌న్ తాజాగా మెర్సిడెస్ బెంజ్ జీఎల్ ఎస్ 600 మేబ్యాక్ మోడ‌ల్ కార్ ని సొంతం చేసుకుంది. దీని ఖ‌రీదు అక్ష‌రాలా రూ. 2 కోట్ల 43 ల‌క్ష‌లు. కెరీర్ తో పాటు వ్య‌క్తిగ‌త జీవితం కూడా హాయిగా సాగిపోతుండ‌టంతో రెట్టించిన ఉత్సాహంతో కృతి సంద‌డి చేస్తోంది. తాజాగా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో జిల్ జిల్ జిగేల్ మంటూ మెరిసింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ని అభిమానుల‌తో పంచుకుంది. ఫ్రాక్ మెర్జ్ డ్ ఫ్యాంట్ త‌ర‌హా డిజైన‌ర్ డ్రెస్ లో కృతి చిరున‌వ్వులు చిందిస్తూ హాట్ గా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోఓలు వైర‌ల్ గా మారాయి.