Begin typing your search above and press return to search.

ప్రేమ‌లో నిండా మునిగాన‌ని హింటిచ్చిందా?

By:  Tupaki Desk   |   7 Feb 2020 12:30 AM GMT
ప్రేమ‌లో నిండా మునిగాన‌ని హింటిచ్చిందా?
X
బాలీవుడ్ యువ‌క‌థానాయిక కృతి స‌నోన్ ప్రేమాయ‌ణాల‌ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. కెరీర్‌ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదీ లేక‌పోయినా ఈ అమ్మ‌డి ఎఫైర్ల‌కు కొద‌వేమీ లేదు. సినిమాల్ని మించి నిరంత‌రం ఏదో ఒక వేడెక్కించే టాపిక్ తో నిరంత‌రం వార్త‌ల్లో నానుతోంది. గ‌త కొంత‌కాలంగా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో ప్రేమాయ‌ణం సాగిస్తూ కృతి హెడ్ లైన్స్ లో హైలైట్ అయ్యింది. కుర్ర‌హీరోని వీడి క్ష‌ణ‌మైనా గ‌డ‌ప‌లేని స‌న్నివేశంలో ఉంద‌న్న ప్ర‌చారం అంత‌కంత‌కు వేడెక్కించింది.

సుశాంత్ - కృతి జంట షికార్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్ప‌టికే అభిమానుల్లో జోరుగా వైర‌ల్ అయ్యాయి. అయితే ఇంత జ‌రిగాక కృతి అక‌స్మాత్తుగా సుశాంత్ కి బ్రేక‌ప్ చెప్పేయ‌డంపైనా గుస‌గుస‌లు వినిపించాయి. సుశాంత్ ప్లేట్ ఫిరాయించి మ‌రో అందాల భామ‌ రియా చ‌క్ర‌వ‌ర్తి (తూనీగ తూనీగ‌)తో క‌మిటైపోవ‌డంతో అలిగిన కృతి ప్ర‌స్తుతం అత‌డికి దూరంగా ఉంటోంది. అంతేకాదు సుశాంత్ పై పంతానికి పోయి మ‌రో యంగ్ హీరో కార్తీక్ ఆర్య‌న్ తో చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిరిగేయ‌డం పైనా ఇటీవ‌ల ర‌క‌ర‌కాలుగా ప్ర‌చార‌మైంది. చెల్లుకు చెల్లు త‌రహా లో కృతి మాజీకి స‌మాధాన‌మిస్తోంద‌న్న గుసగుస‌లు వేడెక్కించాయి.

అదంతా స‌రే కానీ.. కృతి లేటెస్ట్ లుక్ ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అవుతోంది. ఓ విమానాశ్ర‌యం నుంచి వ‌స్తూ కృతి ఒక న్యూ ట్రెండీ లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. కృతి నేవీ బ్లూ క‌ల‌ర్ సూట్ లో క‌నిపించింది. వ‌దులైన ఆ సూట్ ని ప‌రిశీలిస్తే ఆ బాట‌మ్ లో ల‌వ్ సింబ‌ర్స్ ప్ర‌త్యేకంగా ఆక‌ర్షిస్తున్నాయి. చినిగినా ఆ డిజైన్ ప‌ర్ఫెక్ట్ గా కుదిరింది. అలా వ‌స్తూ ముసిముసిగా లోలోన న‌వ్వేసుకుంటూ క‌నిపించింది కృతి. అమ్మాయి న‌వ్వుకు నానా అర్థాలు తీసేవాళ్లంతా ఇది మ‌లి ప్రేమ దోమ కుట్ట‌డ‌మేనంటూ గుస‌గుస‌లాడేస్తున్నారు. కార్తీక్ ఆర్య‌న్ - కృతి జంట‌గా న‌టించిన లూకా చుప్పీ మార్చి 1న రిలీజ్ కి రానుంది. ఆ క్ర‌మంలోనే ఇక‌పై కృతి ప్ర‌చారంలో బిజీ కానుంది.