Begin typing your search above and press return to search.

మహేష్ చైతుల హీరోయిన్ ఇంత బిజీనా!

By:  Tupaki Desk   |   7 Dec 2018 1:30 AM GMT
మహేష్ చైతుల హీరోయిన్ ఇంత బిజీనా!
X
కమర్షియల్ గా ఫెయిల్ అయినా 1 నేనొక్కడినే చాలా స్పెషల్ మూవీగా ఫీలవుతారు అభిమానులు. సుకుమార్ టేకింగ్ తో పాటు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం దాన్ని థియేటర్ల నుంచి బయటికి వచ్చాక కల్ట్ క్లాసిక్ గా మార్చేశాయి. అందులో హీరోయిన్ గా పరిచయమైన కృతి సనన్ గుర్తుందా. తర్వాత నాగ చైతన్యతో దోచేయ్ అనే సినిమా చేసింది కానీ ఆ రెండు ఫలితాలు తీవ్రంగా నిరాశ పరచడంతో జెండా బాలీవుడ్ కు షిఫ్ట్ చేసింది. అక్కడా కొంత కాలం బ్యాడ్ టైం నడిచింది. మగధీర స్ఫూర్తితో రూపొందిన రాబ్తా డిజాస్టర్ కావడంతో అమ్మడికి పెద్ద బ్రేక్ పడింది.

కానీ జాతకంలో ఎక్కడో సుడి ఉన్నట్టుంది. అనూహ్యంగా ఈ ఏడాది పుంజుకుని ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్టులు తన ఖాతాలో వేసుకుని యమా బిజీగా మారిపోయింది. 2018లో కృతి సనన్ కనిపించింది స్త్రీ మూవీలోనే. అది కూడా స్పెషల్ సాంగ్ రూపంలో. కానీ హీరోయిన్ గా 2019లో పెద్ద రచ్చే చేయబోతోంది. దిల్జిత్ దోషాన్జ్ తో నటించిన అర్జున్ పాటియాలా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. కార్తీక్ ఆర్యన్ తో చేసిన లుకా చుప్పి ఫినిషింగ్ స్టేజి లో ఉంది.

క్రేజీ మల్టీ స్టారర్ హౌస్ ఫుల్ 4లో అక్షయ్ కుమార్ సరసన నటించింది. ఇందులో టాలీవుడ్ హాట్ బ్యూటీ పూజా హెగ్డే మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఇవి కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతున్న పానిపట్ లో మంచి ఆఫర్ కొట్టేసింది. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా మరాఠి బాష కూడా నేర్చుకున్న కృతి సనన్ మరో మల్టీ స్టారర్ కళంక్ లో క్యామియో చేస్తోంది. 2014లో డెబ్యూ చేసిన కృతి సనన్ ఈ నాలుగేళ్లలో ఇంత బిజీగా మారింది ఇప్పుడే. చూస్తుంటే 2019 బాగా కలిసి వచ్చేలా ఉంది