Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: గట్టిగానే ప్రయత్నిస్తోంది

By:  Tupaki Desk   |   8 Dec 2016 4:15 AM GMT
ఫోటో స్టోరి: గట్టిగానే ప్రయత్నిస్తోంది
X
ఇప్పుడు బాలీవుడ్ లో హిట్టు కొట్టాలంటే.. లేదా పెద్ద హీరోల సినిమా పట్టేయాలంటే.. ముందుగా అందరినీ గ్లామర్ తోనే కొట్టాలి. అందుకే కదా.. ఆలియా భట్.. శ్రద్దా కపూర్ వంటి భామలు వచ్చీ రాగానే బికినీల్లోకి దిగేశారు. ఒకవేళ వెండితెర మీద కాకపోతే మ్యాగజైన్లలోనైనా రెచ్చిపోవాలి.

సరిగ్గా ఇప్పుడు ఈ ఫార్ములాను అర్ధం చేసుకున్నట్లుంది హీరోయిన్ కృతి సనోన్. అమ్మడు తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా పెద్దగా బ్రేక్ రాలేదు. రెండూ ఫ్లాపులే. ఇక హిందీలో దిల్ వాలే సినిమా ఇచ్చిన పంచ్ తో కాస్త చతికిలపడిందనే చెప్పాలి. కాకపోతే ఈ ఢిల్లీ బెల్లి నిధానంగా బాలీవుడ్ రేంజు హాట్నెస్ ను వంటబట్టించుకుంటోంది. అమ్మడు మరీ బికినీల్లో రెచ్చిపోకపోయినా కూడా.. అదిగో మ్యాగ్జిమ్ మ్యాగజైన్ కోసం ఏదో క్రియేటివ్ గా బాగానే ఆరబోస్తోంది.

మొన్నామధ్యన మొహంజొదారో సినిమాతో ఫ్లాపులో తేలిపోయిన పూజా హెగ్డే కూడా.. సడన్ గా ఇలా ఒక మ్యాగజైన్లో బీభత్సమైన గ్లామర్ తో రెచ్చిపోయింది. ఇప్పుడు కృతి కూడా అదే ఫాలో అయ్యింది. మరి వీళ్ల గట్టి గట్టి ప్రయత్నాలకు బాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.