Begin typing your search above and press return to search.
ఆదిపురుష్ విమర్శలపై సీతమ్మ సీరయస్!
By: Tupaki Desk | 20 Nov 2022 5:30 AM GMTప్రభాస్ కథానాయకుడిగా నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం `ఆదిపురుష్` టీజర్ ఎలాంటి విమర్శలకు గురైందో చెప్పాల్సిన పనిలేదు. పిల్లలతో సహా పెద్దలు అంతా ఇదేదో? బాలల చిత్రంలా ఉందే? అంటూ హాస్యాస్పదంగా స్పందించారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కుంది. దీంతో చిత్ర బృందం మధ్య పొరపొచ్చాలు తలెత్తినట్లు ప్రచారం సాగింది.
దీంతో యూనిట్ సినిమాకి మళ్లీ రిపేర్లు మొదలు పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా రావణసూరుడు పాత్రని మళ్లీ రీషూట్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. టీజర్ రిలీజ్ దగ్గర నుంచి ఆదిపురుష్ రోజు ఓ విమర్శని ఎదుర్కోవాల్సి వస్తోంది. అయితే వీటిపై ప్రభాస్ గానీ..చిత్ర దర్శకుడు ఓం రౌత్ సహా నిర్మాతలు ఏనాడు స్పందించింది లేదు.
ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు తప్ప వాటిని పట్టించుకున్నట్లు కనిపించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా అందులో హీరోయిన్ గా సీత పాత్ర పోషిస్తున్న కృతిసనన్ మాత్రం విమర్శలపై తనదైన శైలిలో కౌంటర్ వేసింది. ఆదిపురుష్ లో చెప్పాల్సింది చాలా ఉంది. బయటకువచ్చింది ఒక్క నిమిషం 35 సెకన్ల టీజర్ మాత్రమే. దీంతోనే పూర్తి కథ అయిపోదు. దర్శకుడు ఓంరౌత్ అదే పనిలో ఉన్నారు.
అందుకు కొంత సమయం కావాలి. ఆయన తెరకెక్కిస్తున్న సినిమాలో భాగమైనందకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. మనచరిత్ర..ఇతిహాస పురాణాలు ప్రపంచం ముందు ఉంచేలా భారీ కాన్వాస్ తో రూపొందుతుంది. ఎక్కడా లోపాలు లేకుండా సరైన రీతిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి. అందుకు సమయం పడుతుంది. ప్రేక్షకులు అంతే సమయమనంతో ఉండాలి.
సినిమా క్వాలిటీ గురించి కొంత మంది ప్రశిస్తున్నారు. ఇష్టాను సారం ట్రోల్ చేస్తున్నారు. దర్శకుడ్ని విమర్శిస్తున్నారు. ఇది భావ్యం కాదు. ఏ పని చేసే ముందైనా ఒక్కసారి ఆలోచించండి. సినిమాలు టైంపాస్ కావొచ్చు. కానీ మేమంతా టైంపాస్ కోసం సినిమాలు చేయలేదు. కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. ఎంతో మంది కష్టపడి రాత్రిపగలు లేకుండా పనిచేస్తున్నారు. ఇవన్నీ ట ట్రోల్ చేసే వారు కూడా గమనిస్తారని ఆశిస్తున్నట్లు స్వీట్ గా కౌంటర్ వేసింది. ఈ బ్యూటీ ఇంతకు ముందు `వన్` సినిమాలో సూపర్ స్టార్ మహేష్ సరసన నటించిన సంగతి తెలిసిదే. అలాగే యువ సామ్రాట్ నాగచైతన్య కి జంటగా `దోచెయ్` లోనూ నటించింది.