Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: కళ్లతో కృతి చేసే కనికట్టు

By:  Tupaki Desk   |   9 Feb 2017 7:54 AM GMT
ఫోటో స్టోరీ: కళ్లతో కృతి చేసే కనికట్టు
X
మహేష్ బాబు మూవీ 1 నేనొక్కడినే చిత్రంతో సినీ అరంగేట్రం చేసిన భామ కృతి సనోన్. ఇక్కడ పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసి బాగానే అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. మరోవైపు ఫోటో షూట్స్ తో కూడా కృతి రెచ్చిపోతున్న తీరును కూడా తెగ పొగడాల్సిందే.

సినీ బ్లిట్జ్ మేగజైన్ ఫిబ్రవరి ఎడిషన్ కు కవర్ పేజ్ కోసం కృతి సనోన్ ఇచ్చిన హాట్ పోజ్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోతోంది. చూసేవాళ్లకు పల్స్ పెరిగిపోయేలా అమ్మడు హాట్ హాట్ గా దర్శనం ఇచ్చింది. క్లీవేజ్ షోలాంటివేమీ లేకపోయినా.. కృతి తన కళ్లతోనే మాయ చేసి పారేసింది. ఈ ఫోటోలో అమ్మడి హెయిర్ స్టైల్.. మత్తుగా చూస్తూ మాయ చేస్తున్న కళ్లు.. స్పెషాలిటీగా చెప్పుకోవాలి. ఇక నాభి సౌందర్యాన్ని.. అడుగు కిందకు వేసిన డెనిమ్ బాటమ్ కానీ.. చూపరులకు మరింత వేడి పెంచేయడం ఖాయం.

బాలీవుడ్ లో సినిమాల ఎంపికలోనూ జాగ్రత్తలు పాటిస్తున్న ఈ బ్యూటీ చేతిలో.. ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. రాబ్తా మూవీలో సుశాంత్ సిగ్ రాజ్ పుత్ తో ఆడిపాడనున్న కృతి సనోన్.. బెరైలీ కి బర్ఫీ మూవీలో ఆయుష్మాన్ ఖురానాతో చిందులు వేయనుంది. ఈరెండు సినిమాలు రిలీజ్ అయ్యాక.. తన రేంజ్ మారిపోతుందని కృతి సనోన్ బోలెడు ఆశలు పెట్టుకుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/