Begin typing your search above and press return to search.

ఛాన్స్‌ లు వెంట రాలేదని బాధపడలేదు

By:  Tupaki Desk   |   10 Aug 2015 6:05 AM GMT
ఛాన్స్‌ లు వెంట రాలేదని బాధపడలేదు
X
1నేనొక్కడినే, దోచెయ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది కృతి సనోన్‌. తొలి పరిచయమే పరిణతి ఉన్న నటి అన్న పేరు తెచ్చుకుంది. సేమ్‌ టు సేమ్‌ బాలీవుడ్‌ లోనూ మొదటి సినిమాతోనే వీరాభిమానుల్ని సంపాదించుకుంది. ప్రస్తుతం బాద్‌ షా షారూక్‌ సరసన 'దిల్‌ వాలే' చిత్రంలో ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా అమ్మడిని కదిలిస్తే చాలా సంగతులే చెప్పింది.

=బాద్‌ షా షారూక్‌ సరసన నటిస్తున్నా. ఇదో అరుదైన అవకాశం. అలాగని ఏదో ఒక సినిమాలో నటించినంత మాత్రాన స్టార్‌ హీరోయిన్‌ అయిపోయానని అనుకోవడం లేదు. ఒక్క సినిమాతో ఇక్కడ స్టార్‌ అయిపోవడానికి నేనేమీ హృతిక్‌ రోషన్‌ ని కాను.

=సినిమా తర్వాత సినిమా అంటూ వెంట వెంటనే అవకాశాలు రాకపోవడానికి కారణాలున్నాయ్‌. నేనేమీ నటవారసురాలిని కాను. నేనెవరో జనాలు గుర్తు పట్టడానికి చాలా టైమ్‌ పట్టింది.

=హీరో ప్యాంటీ తర్వాత టైగర్‌ ష్రాప్‌ తో ఓ మ్యూజిక్‌ వీడియో లో నర్తించా. ఇద్దరం కలిసి హీరో ప్యాంటీ తోనే డెబ్యూ అయ్యాం కాబట్టి .. ఆరంభం కెమెరా ముందు భయపడ్డాం. కానీ ఇద్దరం కొత్తవాళ్లమే కాబట్టి కలిసిపోయాం. మ్యూజిక్‌ వీడియోలో కలిసి నటిస్తున్నప్పుడు హీరో ప్యాంటీ 2లో నటిస్తున్నామా? అనిపించింది.

=నా వయసుకు ప్రేమకథా చిత్రాలు సూటవుతాయి. అయితే విషాదాంతం నచ్చదు. ప్రేమికులు విడిపోతే చూడలేను.