Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వైట్ లో బ్రైట్ గా

By:  Tupaki Desk   |   18 July 2017 4:03 PM GMT
ఫోటో స్టోరి: వైట్ లో బ్రైట్ గా
X
మహేష్ బాబు మూవీ 1 నేనొక్కిడినేతో సినిమాల్లోకి వచ్చిన కృతి సనోన్.. చకచకా బాలీవుడ్ వైపు అడుగులు వేసేసింది. ఇంకా ఆశించిన స్థాయి బ్రేక్ సినిమాల్లో రాలేదు కానీ.. క్రేజ్ పరంగా మాత్రం ఈ సుందరి.. ఫోటోషూట్స్ తెగ హంగామా చేసేస్తోంది. ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ కోసం రీసెంట్ గా కృతి సనోన్ ఓ ఫోటో షూట్ చేసింది. ఇందులో అమ్మడి అందాలు తళతళలాడిపోయాయి.

అలా మెరిసిపోయేందుకు ఎంతగా కష్టపడిందో కానీ.. అమ్మడు వేసిన వైట్ కలర్ డ్రెసింగ్ మరింతగా హెల్ప్ చేసింది. మరీ ఉల్లిపొర మాదిరిగా ఈ డ్రెసింగ్ ఉండడం.. కవర్ పేజ్ పై కనిపిస్తున్న పోజ్ రెచ్చగొట్టేస్తుండడంతో.. లోపలి పేజీలను చూసేందుకు కవర్ పేజ్ తిప్పడానికి కాసింత సమయం పడుతుందంటే ఆశ్యర్యం లేదు. అయితే.. ఇన్నర్ పేజెస్ లో కృతి సనోన్ తన అందాలను మరింతగా ఆవిష్కరించేసింది. సొగసులు.. సోయగాలు.. స్టైలింగ్.. ఏ విషయంలో అయినా సరే.. తాను ఎంతటి అల్ట్రా మోడర్న్ అనే విషయాన్ని చెప్పకనే చెప్పింది కృతి సనోన్.

వైట్ ఈజ్ రైట్ అంటున్న కృతిని చూసి.. నిజమే తెల్లదనం ఈమె హక్కే అనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఈ పొడుగు కాళ్ల సుందరిని బాలీవుడ్ బాగానే ఆదరిస్తోంది. ఒక్కొక్కటిగా అయినా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. బెరైలీ కీ బర్ఫీ మూవీతో త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది కృతి సనోన్.