Begin typing your search above and press return to search.
నీళ్లలా ధారపోశాడు అంటున్న కృతి
By: Tupaki Desk | 13 Nov 2015 6:10 AM GMTవిజువల్ రిచ్ నెస్ రావాలంటే ఏం చేయాలి? రాజీ లేకుండా ఖర్చు పెట్టించాలి. ఇలాంటి విషయాల్లో మన స్టార్ డైరెక్టర్లు చాలా స్పీడ్ గా ఉంటారని ఇటీవలి కాలంలో ఓ రెండు భారీ డిజాస్టర్లు ప్రూవ్ చేశాయి. అయితే బాలీవుడ్ లాంటి చోట రెగ్యులర్ కంటెంట్ కి - రెగ్యులర్ సినిమాలకు అంతగా ఖర్చు చేయరు. ఒకవేళ ఖర్చు పెడితే అందుకు తగ్గట్టే సంథింగ్ ఇంకేదో ఉండాలి. రిటర్న్స్ తెచ్చుకోవడానికి ఓ భరోసా కావాలి. సరిగ్గా ఇలా ఆలోచిస్తాడు కాబట్టే బాద్ షా షారూక్ ఖాన్ సొంత ప్రొడక్షన్ లో రోహిత్ శెట్టితో కలిసి దిల్ వాలే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దిల్ వాలే దుల్హానియా లేజాయేంగే జంట నటిస్తున్న తాజా చిత్రం .. దిల్ వాలే .. నేడే చూడండి అంటూ ప్రమోషన్ కూడా చేస్తేస్తున్నాడు. ఈ సినిమా ఆన్ సెట్స్ సిత్రాల గురించి ఇందులో యంగ్ హీరోయిన్ గా నటించిన కృతి సనోన్ ఇలా చెప్పొకొచ్చింది.
అసలు షారూక్ ది రాజీ లేని మనస్తత్వం. ప్రొడక్షన్ కోసం ఎంతయినా ఖర్చు చేసేస్తారంటే నమ్మండి. దిల్ వాలే కోసం ఆయన డబ్బును మంచి నీళ్లలా ఖర్చు చేశారు. సీన్లు బాగా తెరకెక్కడం కోసం ధనాన్ని తెగ ధారపోశారు. అయితే అదంతా క్వాలిటీ కోసమే.. నని కృతి చెప్పింది. లావిష్ లొకేషన్స్ - భారీ స్టంట్స్ - కార్ ఛేజ్ లు - యాక్షన్ కోసం ఎంతో భారీగా ఖర్చు పెట్టారు. అదంతా ప్రత్యక్షంగా చూశాను. అస్సలు షారూక్ డబ్బును కేర్ చెయ్యనే లేదు .. అంటూ కృతి తెగ ఇదైపోయింది. దిల్ వాలే డిసెంబర్ 18న రిలీజవుతోంది కాబట్టి ఆ ఖర్చును కనులారా చూసే అవకాశం అప్పటికి గానీ సాధ్యపడదు. డీడీఎల్ జేని కొట్టే సినిమాని షారూక్ తీశాడా? లేదా? వెయిట్ చేయాల్సిందే మరి!