Begin typing your search above and press return to search.
స్కూల్స్ లో సెక్సెడ్యుకేషన్ కావాలంటున్న మహేష్ హీరోయిన్
By: Tupaki Desk | 15 May 2020 6:00 AM GMTదిల్లీకి చెందిన స్కూల్ విద్యార్థులు కొందరు బాయ్స్ లాకర్ రూం అంటూ ఒక సోషల్ మీడియా గ్రూప్ క్రియేట్ చేసి అమ్మాయిల గురించి అసభ్యంగా మాట్లాడుకోవడం అమ్మాయిల ఫొటోలను షేర్ చేసుకోవడం తెల్సిందే. దేశ వ్యాప్తంగా ఆ సంఘటన సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున ఈ సంఘటన గురించి మీడియాలో చర్చ జరుగుతోంది. స్కూల్ పిల్లలు అలాంటి పని చేయడంతో ఈ సమాజం ఏమై పోతుందో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
బాయ్స్ లాకర్ రూం సంఘటనపై మహేష్‌బాబు ‘1 నేనొక్కడినే’ చిత్రం హీరోయిన్ కృతి సనన్ తీవ్రంగా స్పందించింది. మనం ఇలాంటి ప్రపంచంలో బతుకుతున్నామో అన్న సందేహం కలుగుతుంది. ఈ సంఘటన గురించి మొదట విన్నప్పుడు షాక్ అయ్యాను. వార్త మొత్తం చదివేందుకు ఇబ్బందిగా అనిపించింది. మామూలుగా అయితే అబ్బాయిలు అమ్మాయిల గురించి మాట్లాడుకోవడం కామన్. కాని దానికి ఒక హద్దు ఉంటుంది. సెక్సీగా ఉంటుందని మాట్లాడుకోవడం వరకు పర్వాలేదు కాని, వారు మరీ శృతిమించారు.
వారి మాటలు విన్నాక బాధ వేసింది. స్కూల్ పిల్లల్లో ఇలాంటి దారుణమైన ఆలోచనలు ఉంటాయా. అమ్మాయిు తక్కువ అబ్బాయిలు ఎక్కువ అనే దోరణిలో పిల్లలు ఉన్నారు. వారి తీరు మారాలి. అందుకు గాను స్కూల్‌లో సెక్సెడ్యుకేషన్‌ను తీసుకు రావాలి. అప్పుడే అబ్బాయిలు అమ్మాయిల గురించి తప్పుగా ఆలోచించడం, తప్పుగా ప్రవర్తించడం మానేస్తారంటూ ఈ సందర్బంగా కృతి సనన్ చెప్పుకొచ్చింది.