Begin typing your search above and press return to search.

నేను డేటింగ్ చేయట్లేదు నాయనో!!

By:  Tupaki Desk   |   21 July 2016 5:30 PM GMT
నేను డేటింగ్ చేయట్లేదు నాయనో!!
X
''కొత్తలో ఇలాంటి రూమర్లు వస్తుంటే.. అలా వస్తాయిలే.. అవే తరువాత కనుమరుగు అయిపోతాయిలే అనుకున్నా.. కాని చివరకు అవి ఏకు మేకై నాకు చుట్టుకున్నాయి'' అంటూ బాధపడుతోంది హీరోయిన్‌ కృతి సనోన్. తెలుగులో అమ్మడు 1-నేనొక్కడినే.. దోచెయ్ సినిమాలను చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇంతకీ ఈమెను బాధిస్తున్న ఆ రూమర్లు ఏంటి?

గత ఐదేళ్ళుగా ఒకే ఫ్లాటులో సహజీవనం చేస్తూ.. చివరకు టివి సీరియల్‌ నటీమణి అంకితా లొకాందే కు కటిఫ్‌ చెప్పేశాడు హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్ పుట్‌. ఆ తరువాత మనోడు యురోపులో ''రాబ్తా'' సినిమా షూటింగు పేరుతో.. హీరోయిన్ కృతి సనోన్ తో చాలా క్లోజుగా దిగిన కొన్ని ఫోటోలను సోషల్ నెట్ వర్కులో పెట్టసాగాడు. ఆ దెబ్బకి ఈ ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారంటూ రూమర్లు వచ్చేశాయి. దీనిపై గతంలో ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చిన కృతి.. నిన్న రాత్రి మదారి సినిమా స్పెషల్‌ ప్రివ్యూకి విచ్చేసిన సందర్భంగా మరోసారి క్లారిటీ ఇచ్చింది.

''నేను సుశాంత్ తో డేటింగ్ చేయట్లేదు. అసలు హంగేరి నుండి షూటింగ్ ముగించుకుని వచ్చాక అతన్ని కలవలేదు కూడా. దయచేసి ఇలాంటి రూమర్లు స్ర్పెడ్ చేయకండి ప్లీజ్‌'' అంటూ మీడియాకు చెప్పుకొచ్చిందీ సుందరి.