Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరీ: వెనక పచ్చబొట్టేసుకున్న బాలీవుడ్ పాప!
By: Tupaki Desk | 2 March 2020 6:45 AM GMTకృతి సనన్ పేరు తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు తక్కువమందే ఉంటారు. ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు కృతి పేరు తప్పనిసరిగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే కృతి సూపర్ స్టార్ తో '1 నేనొక్కడినే' లో హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగచైతన్య 'దోచేయ్' లో కూడా నటించింది. టాలీవుడ్ లో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో బాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేసింది. లక్కీగా అక్కడ బిజీ అయిపోయింది. ఇక సామాజిక మాధ్యమాల సంప్రదాయాలను డీమానిటైజ్ చేసి హాటు కల్చర్ ను బలవంతంగా తీసుకొచ్చిన ఘాటుభామల బృందంలో సభ్యురాలు.
అందుకే ఈ భామకు ఇన్స్టాలో 29 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. రెగ్యులర్ గా ఏదో ఒక ఫోటో పోస్ట్ చేస్తూ అందరినీ మురిపిస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫోటోకు "ఇదో కొత్త ప్రారంభం... పచ్చబొట్టు పడింది" అంటూ సభ్య సమాజానికి టాటూ సందేశం ఇచ్చింది. ఎడమ భుజం వెనుకభాగంలో వీపుపై 'V' అనే ఆంగ్ల అక్షరం కనిపిస్తోంది. ఈ పచ్చబొట్టును చూపిస్తూ టీ-షర్టు ను కొద్దిగా కిందకు జరిపి మరీ ఒక వైపుకు తిరిగి ఝకాస్ పోజిచ్చింది. హెయిర్ స్టైల్.. మేకప్ అదిరిపోయింది. ఫోటోలో కృతి పుత్తడిబొమ్మలా కనిపిస్తోంది. మొహంలో ఓ అల్లరి నవ్వు తొంగి చూస్తోంది.
ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి సూపర్ స్పందన దక్కింది. "టాటూ సూపర్".. "స్టన్నింగ్ లుక్" అంటూ పచ్చబొట్టును మెచ్చుకున్నారు. ఒకరు మాత్రం "బాయ్ ఫ్రెండ్ పేరా అది?" అంటూ ఆరా తీయడానికి ప్రయత్నించారు. కృతి గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేసిందిని రూమర్లు ఉన్నాయి. అంతకు ముందు గౌరవ్ అరోరా అనే మోడల్ కమ్ యాక్టర్ తో సిద్ శ్రీరాం హిందీ డబ్బింగ్ పాటలు పాడుకుంటూ తిరిగిందని అన్నారు. ఇప్పుడు ఈ 'V' ఎవరు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక కృతి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం 'మిమి' అనే హిందీ సినిమాలో నటిస్తోంది.