Begin typing your search above and press return to search.
మహేష్ హీరోయిన్ కి తిట్లు - చీవాట్లు
By: Tupaki Desk | 9 Aug 2018 4:44 AM GMTసెలబ్రిటీలు ఎరక్కపోయి ఇరుక్కుంటున్నారు! దొరక్క దొరక్క దొరికిపోయి దంపుడుకి గురవుతున్నారు! తెలిసీ తెలియకో - తెలిసీ తెలియనట్టో ఏదైనా చేస్తే మాత్రం తిత్తి తీస్తున్నారు జనం. కొందరైతే తోలు ఒలిచి చెప్పులు కుట్టుకుంటున్నారు. ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రిటీలకు ఆన్ లైన్ - సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్ష అనుభవమిది. నచ్చని వాళ్లకు నెటిజనులు నేరుగా నరకానికి కేరాఫ్ అడ్రెస్ చూపిస్తున్నారు.
ఇదిగో ఇది కూడా ఆ కేటగిరీనే. ఈ అమ్మడు ఇప్పటికే పలుమార్లు అడ్డంగా దొరికిపోయింది. ఫ్యాషన్ - ట్రెడిషన్ విషయంలో సామాజిక మాధ్యమాల్లో తిట్లు - చీవాట్లు తింది. అయినా ఇంకా ఇంకా బుద్ధి రాలేదా? అంటూ మరోసారి తిట్లాసురల నుంచి తిట్ల దండకాన్ని ఎదుర్కొంటోంది. ఈ అమ్మడు ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పనేలేదు. అటు బాలీవుడ్ వాళ్లకే కాదు - ఇటు టాలీవుడ్ - కోలీవుడ్ వాళ్లకు మాబాగా తెలిసిన అందగత్తెనే. అందాల కృతి సనోన్. 1నేనొక్కడినే సినిమాతో మహేష్ నాయికగా పాపులరైంది. బాలీవుడ్ యువహీరోలతో ఎఫైర్లు సాగిస్తున్న నాయికగానూ ఇప్పటికే హాట్ టాపిక్. అసలింతకీ ఏమా అసలు సంగతి అంటే.. ఇదిగో ఈ ఫోటో చూస్తేనే తెలిసిపోతోంది.
ప్రఖ్యాత కాస్మొపాలిటన్ మ్యాగజైన్ కవర్ కి కృతి ఇచ్చిన ఫోజు పెను దుమారం రేపింది. పక్కనే వేలాడదీసిన జిరాఫీ .. ఆ పక్కన ఈ అమ్మడు మిరుమిట్లు గొలిపే ఫోజులు.. చూడగానే కుర్రకారు కిర్రెక్కిపోవడం మాట అటుంచితే, తిట్ల దండకంతో ఊచకోత కోసారు. అసలు సిగ్గు లేదా.. ఆ ఫోజేంటి? మూగజీవి జిరాఫీని వేలాడదీస్తేనే నీకింత మూడొస్తుందా? అంటూ ఒకటే తిట్టి పారేశారు. ఈ కవర్ షూట్ లండన్ లోని ఓ ప్రయివేటు గృహంలో షూట్ చేశారు. అందులో ఇదిగో ఈ తరహా జంతువుల స్కల్ప్ చర్ హైలైట్ గా ఉంది. అయితే మూగ ప్రాణుల పట్ల క్రూరత్వం ప్రదర్శించడమే ఏమీ బాలేదన్నది నెటిజనుల ఉద్ధేశం. అయితే ఈ విషయం కాన్సెప్టు డిజైన్ చేసినవాళ్లకు తెలియదంటారా? ఏవో తిట్లో - చీవాట్లో - దండకాలో లేనిదే ప్రచారం ఎలా కలిసొస్తుంది? అదిగో అద్గదే ఫార్ములా అయ్యుండొచ్చు కదా!?