Begin typing your search above and press return to search.
మహేష్ భామ.. గట్టిగానే కొట్టిందమ్మా
By: Tupaki Desk | 9 March 2017 5:14 AM GMT1-నేనొక్కడినే మూవీతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృతి సనోన్.. ఎప్పటికప్పుడు తాను ఎంత డిఫరెంట్ గా ఆలోచిస్తుందో చెప్పకనే చెబుతూ ఉంటుంది. రీసెంట్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ.. తెగ మెసేజ్ లు పోస్ట్ చేశారు. మహిళా శక్తి.. స్ఫూర్తి.. చైతన్య.. ఇలా చాలానే చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఆ రోజుతోనే చాలామంది మర్చిపోతారనడంలో పెద్దగా సందేహాలు అక్కర్లేదు.
ఉమెన్స్ డే సందర్భంగా.. కృతి సనోన్ ఓ స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది. ఇందులో కూడా ఇలాంటి మేటరే ఉంటుందని అనుకున్న వాళ్లకు షాక్ ఇచ్చేసిందీ బ్యూటీ. స్త్రీ హక్కులు.. లింగ సమానత్వం అంటూ మాట్లాడే వారికి గట్టి పంచ్ ఇచ్చింది కృతి. ఈ స్పెషల్ వీడియోలో వరుసగా ప్లకార్డులను చూపిన ఈమె.. ప్రతీ కార్డుకు తగ్గట్లుగా ఫీలింగ్స్ మార్చేసి ఆకట్టుకుంది. 'మనం ఇవాళ బోలెడన్ని మాటలు వింటూ ఉంటాం. అమ్మాయిల శక్తి.. మహిళా హక్కులు.. లింగ సమానత్వం.. ఇంకెన్నెన్నో' అన్న కృతి.. ఆ తర్వాత అసలు వెటకారం ఆడింది.
'ఇదే సమయంలో మనపై ఒత్తిడి అలానే ఉంటుంది. ఇతరులు మనం ఏం వేసుకోవాలో డిసైడ్ చేస్తారు.. మనమందరం మాత్రం మాట్లాడుతూ ఉంటామంతే' అన్న కృతి.. ఏదో ఒకటి సంతోషమేలే అంటూ నీరసంగా ముగించేసింది. కృతి చెబుతున్న విషయంలో చాలానే మ్యాటర్ ఉన్నట్లుంది కదూ!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/