Begin typing your search above and press return to search.
చరణ్ అంటే చాలా ఇష్టం: 'ఉప్పెన' బ్యూటీ!
By: Tupaki Desk | 18 Jan 2022 9:11 AM GMT'ఉప్పెన' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి వరుస సక్సెస్ లతో దూసుకుపోతోంది. తాజాగా 'ఆలీతో సరదాగా'లో ఆమె మాట్లాడుతూ .. "బేసిగ్గా మాది 'ఉడిపి' పక్కన ఒక ఊరు .. కానీ నేను ముంబైలో పుట్టి పెరిగాను. మొదటి నుంచి కూడా నేను ఎవరితో ఎక్కువగా కలిసే దానిని కాదు. నేను కాస్త అందరిలో కలుస్తాననే ఉద్దేశంతో యాక్టింగ్ వైపు పంపించాలని మా పేరెంట్స్ అనుకున్నారు. ఆ సమయంలో యాడ్స్ చేయడానికి అవకాశం రావడంతో చేశాను. ఆ సమయంలో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరికి 'ఉప్పెన' కథ వచ్చింది. ముందుగా చేయనని చెప్పాను .. కానీ కథ విన్న తరువాత ఈ సినిమా చేయాలని అనుకున్నాను.
'ఉప్పెన' సినిమా నుంచి 'నీ కన్ను నీలి సముద్రం' పాటను రిలీజ్ చేసినప్పుడు నాకు చాలా మెసేజ్ లు వచ్చాయి. అంతా ఆ పాటను గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మా ఫ్యామిలీ నుంచి ఎవరూ ఇండస్ట్రీలో లేకపోవడం వలన, నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాననే విషయం అప్పుడే నాకు అర్థమైపోయింది. ముందుగా నాకు తెలుగు అంత బాగా రాదు. 'ఉప్పెన' సినిమా షూటింగు సమయంలో అంతా తెలుగులో మాట్లాడుతుంటే, నాకు తెలుగు రాకపోవడం వలన వాళ్లకి కనెక్ట్ కాలేకపోయాను. అందువలన ఆ తరువాత నుంచి తెలుగు సినిమాలు ఎక్కువ చూశాను .. తెలుగును నేర్చుకున్నాను.
'శ్యామ్ సింగ రాయ్' హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 'బంగార్రాజు'లో చైతూతో కలిసి నటించడం హ్యాపీగా అనిపించింది. ఇంట్లో నేను ఎక్కువ అల్లరి చేస్తుంటాను .. 'బంగార్రాజు' సెట్లోను అలాగే ఉన్నాను. ఎందుకంటే కల్యాణ్ కృష్ణ గారు నాకు అంత కంఫర్టును ఇచ్చారు. 'ఉప్పెన' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు నా గురించి చెప్పిన మాట నాకు ఓ గిఫ్ట్ లా అనిపించింది. ఆ తరువాత ఆయన తన చేత్తో చాలామంచి మాటలతో ఒక లెటర్ రాసి, దానితో పాటు ఒక గిఫ్ట్ పంపించారు. ఆ లెటర్ ని ఫ్రేమ్ కట్టించుకున్నాను. మెగాస్టార్ గారు మెచ్చుకోవడం గొప్పవిషయం.
'శ్యామ్ సింగ రాయ్'లో నేను సెకండ్ హీరోయిన్ ను అనే ఆలోచన నాకు రాలేదు. సినిమా టీమ్ కూడా ఎక్కడా నాకు ఆ ఫీలింగ్ ను రానీయలేదు. 'ఉప్పెన'లో నేను చేసిన పాత్రకి పూర్తి డిఫరెంట్ గా ఉండటం వలన, 'శ్యామ్ సింగ రాయ్'లో చేశాను. కొత్త పాత్రల వలన కొత్త విషయాలను నేర్చుకోవచ్చుననే ఉద్దేశంతోనే ఆ సినిమాను చేశాను. ఇక 'బంగార్రాజు'లో నేను సర్పంచ్ 'నాగలక్ష్మి'గా కనిపిస్తాను. నేను మంచిగా ఉన్నంతవరకే సర్పంచ్ నాగలక్ష్మి .. తేడా వస్తే సింహం లాంటి లక్ష్మి. తెలుగులో అందరి హీరోలతోను చేయాలనుంది. ముఖ్యంగా చరణ్ గారితో చేయాలనుకుంటున్నాను. ఆయన చేసిన 'రంగస్థలం' చూశాను .. ఆ సినిమాలో ఆయన గొప్పగా చేశారు" అంటూ తన మనసులోని మాటను బయట పెట్టింది.