Begin typing your search above and press return to search.

ప్ర‌భుదేవా -అట్లీని తిట్టి జ‌క్క‌న్న‌ను పొగిడిన కేఆర్కే

By:  Tupaki Desk   |   29 Jun 2021 1:30 PM GMT
ప్ర‌భుదేవా -అట్లీని తిట్టి జ‌క్క‌న్న‌ను పొగిడిన కేఆర్కే
X
వివాదాల‌తో అంట‌కాగ‌డం కొంద‌రికి హ్యాబిట్. టాలీవుడ్ లో ఆర్జీవీ నిరంత‌రం ఏదో ఒక వివాదాన్ని తెర‌పైకి తెచ్చి హాట్ టాపిక్ గా మారుతుంటారు. అటు బాలీవుడ్ లో విమ‌ర్శ‌కుడు కం న‌టుడు కేఆర్కే ఈ త‌ర‌హానే. అత‌డి క్రిటిసిజం.. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు తావిస్తుండ‌డంతో చాలామంది స్టార్ హీరోలు అత‌డిపై గుర్రుమీదున్నారు. అమీర్ ఖాన్ .. స‌ల్మాన్ ఖాన్.. షారూక్ .. ప్ర‌భాస్.. వంటి పెద్ద స్టార్ల‌ను అత‌డు త‌న‌దైన విమ‌ర్శ‌ల‌తో తూల‌నాడాడు.

స‌ల్మాన్ బీయింగ్ హ్యూమ‌న్ పైనా అత‌డు చేసిన వ్యాఖ్య‌ల‌కు భాయ్ హ‌ర్ట‌యిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే స‌ల్మాన్ న‌టించిన రాధే పై విమ‌ర్శ‌లు గుప్పించిన కేఆర్కే స‌ల్మాన్ బీయింగ్ హ్యూమ‌న్ పైనా అంతే విమ‌ర్శ‌ల‌తో చెల‌రేగ‌డంతో భాయ్ న్యాయం కావాల‌ని కోర్టుకి వెళ్లారు. ప్ర‌స్తుతం ఈ వివాదం కొన‌సాగుతుండ‌గానే కేఆర్కే ప‌లువురు ద‌ర్శ‌కుల‌పై చేసిన కామెంట్లు సంచ‌ల‌నంగా మారాయి.

రాధే దర్శ‌కుడు ప్ర‌భుదేవాను మ‌రో త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీని కూడా అత‌డు టార్గెట్ చేసి కామెంట్లు చేశాడు. బాలీవుడ్ లో ఎప్పటికీ విజయం సాధించలేని దర్శకులు ప్రభుదేవా- అట్లీ అంటూ ట్రోల్ చేయడంతో మరోసారి హెడ్ లైన్స్ లోకొచ్చాడు.

``మంచి లేదా చెడు ఏదైనా దర్శకుడి ప్రాథమిక అర్హత కనీసం హిందీ చిత్రం చేయడానికి హిందీ భాషను తెలుసుకోవడం. బాలీవుడ్ లో ప్రభుదేవా పెద్ద ఫ్లాపులిచ్చారు. కార‌ణం అతనికి క్లూ లేదు.. న‌టీన‌టులు ఏ డైలాగ్స్ చెప్పారు? అన్న‌ది తెలీదు. దర్శకుడు అట్లీ విషయంలో కూడా ఇదే! అతను దక్షిణాదిలో గొప్ప కథకుడు కావచ్చు`` అని కేఆర్కే వ్యాఖ్యానించాడు.

ఆస‌క్తిక‌రంగా ప్ర‌భుదేవా- అట్లీల‌ను టార్గెట్ చేసిన కేఆర్కే రాజమౌళి- సందీప్ వంగాల‌ను మాత్రం పొగిడేశారు. ఆ ఇద్ద‌రూ హైదరాబాద్ కు చెందినవారని హిందీ బాగా తెలుసునని కెఆర్‌కె ప్ర‌శంసించారు. వాంటెడ్ తో ప్రభుదేవా హిట్టు కొట్టారు. కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ తో త్వ‌ర‌లో అట్లీ సినిమా చేయనున్నాడు. కేఆర్కే వ్యాఖ్య‌ల‌కు ఆ ఇద్ద‌రూ ఎలాంటి కౌంట‌ర్లు సిద్ధం చేస్తారో చూడాలి. ఇక అత‌డు క్వీన్ కంగ‌న‌ను కూడా వ‌దిలిపెట్ట‌లేదు. బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అని భ‌జ‌న చేసుకునే కంగ‌న టాప్ హీరోయిన్ కాదు ఫ్లాప్ హీరోయిన్ అని ఓ ట్వీట్ లో కామెంట్ చేశాడు. వ్యాక్సినేష‌న్ లో అమెరికా ప్ర‌పంచంలోనే 13వ స్థానంలో ఉంటే భార‌త‌దేశం 86వ స్థానంలో ఉంద‌ని వ్యాఖ్యానించాడు.