Begin typing your search above and press return to search.
సల్మాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడనుకోలేదు!!
By: Tupaki Desk | 23 Nov 2021 6:40 AM GMTబాలీవుడ్ సినీ ప్రేక్షకులకు మరియు ఇండస్ట్రీ వర్గాల వారికి సుపరిచితుడు కమల్ ఆర్ ఖాన్. ఈయన బాలీవుడ్ లో వచ్చే దాదాపు అన్ని సినిమాలను తన రివ్యూలతో ఓ రేంజ్ లో ఏకి పారేస్తూ ఉంటాడు. కొన్ని సినిమాలకు జనాలు మరియు ఇతర రివ్యూవర్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చినా కూడా కమల్ ఆర్ ఖాన్ మాత్రం ఏదో ఒక పాయింట్ పట్టుకుని ఆ సినిమా చెత్త అనేస్తాడు.
అలా ఎన్నో సినిమాలను తనదైన శైలిలో విమర్శించి.. స్టార్ హీరోల అభిమానుల చేతిలో దెబ్బలు తినే వరకు తీసుకు వచ్చాడు. ఆయన ఎన్నో సార్లు మీడియాలో స్టార్ హీరోల గురించి కామెంట్స్ చేసి మీడియాలో నిలిచాడు.
సల్మాన్ ఖాన్ రాధే సినిమాకు బ్యాడ్ రివ్యూ ఇవ్వడం మాత్రమే కాకుండా సల్మాన్ ను కూడా వ్యక్తిగతంగా విమర్శించాడు. దాంతో సల్మాన్ ఖాన్ ఇప్పటికే కమల్ ఆర్ ఖాన్ పై కోర్టుకు వెళ్లాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణ జరుగుతోంది.
రాధే మూవీ విడుదల అయినప్పటి నుండి సల్మాన్ అభిమానులు మరియు కమల్ ఆర్ ఖాన్ ల మద్య గొడవ జరుగుతూనే ఉంది. అది ఈమద్య కాస్త తగ్గిందని చెప్పాలి. మీడియాలో పెద్దగా ఆ వివాదం గురించి కథనాలు రావడం లేదు.
ఈ సమయంలో మరోసారి ఆ విషయాన్ని కమల్ ఆర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా ప్రస్థావించడం చర్చనీయాంశంగా మారింది. సల్మాన్ ఖాన్ నన్ను ఇంతగా లవ్ చేస్తున్నాడని అనుకోవడం లేదు.
నేను ఈమద్య కాలంలో ఆయనకు వ్యతిరేకంగా వీడియోలు ఏమీ చేయలేదు. అయినా కూడా ఆయన నన్ను 24/7 మిస్ అవుతున్నట్లుగా ఉన్నాడు. అందుకే నాకు మళ్లీ కోర్టు ద్వారా నోటీసును పంపించాడు. అతడి నోటీసుకు నేను సమాధానం ఇవ్వాలంటూ కమల్ ఆర్ ఖాన్ పేర్కొన్నాడు.
గతంలో వేసిన కోర్టు కేసుకు సంబంధించిన నోటీసును మళ్లీ కమల్ అందుకున్నాడు. సల్మాన్ ఖాన్ మళ్లీ కొత్తగా ఏమీ కోర్టులో కమల్ కు వ్యతిరేకంగా కేసు వేయలేదు. విచారణ నిమిత్తం కోర్టు నోటీసులు ఇలా పంపించడం చాలా కామన్ గా జరిగే విషయం అంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు.
కాని కమల్ ఆర్ ఖాన్ ఈ విషయాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం వాడుకున్నాడు అంటూ సల్మాన్ ఖాన్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోసారి కమల్ ఆర్ ఖాన్ మరియు సల్మాన్ ల వివాదం తెరపైకి రావడంతో అసలేం జరుగుతంది అంటూ అంతా చర్చించుకుంటున్నారు.