Begin typing your search above and press return to search.
సైలెంటుగా సెగల్ రేపుతున్న పోరి
By: Tupaki Desk | 22 Aug 2015 9:39 AM GMTసైలెంటుగా వెండితెరపైకి వచ్చింది. ఓవర్ నైట్ హిట్ కొట్టేసింది. కట్ చేస్తే ఓ క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ అంటూ ఎనౌన్స్ మెంట్. ఓ అగ్రనిర్మాత సినిమాలో ఆఫర్. కానీ ఏమైందో ఆ తర్వాత సీన్ రివర్సయ్యింది. ఛాన్స్ మిస్సయ్యింది. అయినా పట్టువదలని విక్రమార్కునికి చెల్లెమ్మలా టాలీవుడ్ ని వదల బొమ్మాళీ వదలా.. అన్నట్టు వెంటపడుతోంది. అసలింతకీ ఎవరీ పోరి? .. ఎస్.. ఈ అమ్మడు కృతిక.
వెంకటేష్ దృశ్యం సినిమాతో యుక్తవయసు స్కూల్ గాళ్ క్యారెక్టర్ లో కెరీర్ ప్రారంభించింది. తొలి సినిమాలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుని మన దర్శనిర్మాతల కళ్లలో పడింది. అంతే వెంటనే అగ్రనిర్మాత దిల్ రాజు 'కేరింత' కోసం ఎంపికైంది. ఏమైందో ఏమో.. ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సొచ్చింది. తర్వాత డెబ్యూ హీరో నాగ అన్వేష్ సరసన 'వినవయ్యా రామయ్య' చిత్రంలో నాయికగా నటించేసింది. సినిమా ఫర్వాలేదు. హీరోయిన్ బావుందన్నారు. అంత మాత్రాన తనవైపు వచ్చిన ప్రతి గిల్లికజ్జా అవకాశానికి మెడ వంచేయలేదు. ఆచితూచి అడుగులేసింది. ఇదిగో ఇప్పుడు మారుతి దర్శకత్వంలో యూత్ టెంప్టింగ్ సినిమాకి ఎంపికైంది.
కేరింత సినిమాతో నూకరాజుగా సికాకుళం యాసలో మాట్లాడి ఆకట్టుకున్న పార్వతీశం సరసన నటిస్తోంది. ఈ సినిమాలో ముగ్గురు నాయికల్లో ఈవిడ ఒకత్తె. ''ఒక్క సినిమాకే కంగారు పడిపోతాననుకున్నారేటి? ఓసోస్ .. అంత సీన్ లేదేం!'' అంటూ శీకాకుళం పిల్లలా చెప్పింది.