Begin typing your search above and press return to search.
దృశ్యం భామ.. రోజులు మారాల్సిందేనట
By: Tupaki Desk | 1 July 2016 5:14 AM GMTకృతిక.. ఇలా చెప్పేస్తే టక్కుమని గుర్తొచ్చేసేంతటి ఫేమ్ ఇంకా ఈ చిన్నది సంపాదించలేదు. దృశ్యం సినిమాలో విక్టరీ వెంకటేష్ కి పెద్ద కూతురుగా నటించిన కృతిక.. వినవయ్యా రామయ్యా చిత్రంతో హీరోయిన్ గా మారింది. ఇవాళ రిలీజ్ అవుతున్న రోజులు మారాయితో మరోసారి తన అదృష్టం పరీక్షించుకుంటోంది. తొలి సినిమా తర్వాత చాలానే ఆఫర్లు వచ్చాయని.. ఏరి కోరి ఈ సినిమాలో యాక్ట్ చేశానంటోంది ఈ భామ.
'మొదట ఈ సినిమా చేయాలని నేను అనుకోలేదు. మారుతి కథ మాత్రమే ఇస్తారని.. దర్శకత్వం చేయరని తెలియడమే ఇందుకు కారణం. అయితే.. ఆయన సీరియల్స్ కి కథ అందించి కూడా అనేక అవార్డులు అందుకున్నారని తర్వాత తెలిసింది. మురళి ఈ చిత్రాన్ని ఎక్స్ పీరియెన్సెడ్ డైరెక్టర్ లా పిక్చరైజ్ చేశారు' అంటోంది కృతిక. ఈ సినిమాలో తాను అమాయకంగా కనిపించి ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఓ స్ట్రాంగ్ కేరక్టర్ పోషించినట్లు తెలిపింది. ఈ సమయంలో తాను ఓ కన్నడ సినిమా కూడా పూర్తి చేశానని తెలిపింది. ఈ చిన్నదానికి భరతనాట్యంలో మంచి ప్రావీణ్యం ఉండగా.. ఈమె ట్రైనింగ్ తీసుకున్న బాక్సర్ కూడా. అలాగే.. తాను కన్నడమ్మాయే అయినా.. తెలుగు సినిమాల్లో నటించేందుకే ఇంట్రెస్ట్ అంటోంది కృతిక.
ఏదైనా సీన్ లో నటించే ముందు తాను రిహార్సల్స్ చేసుకోనని.. అప్పటికప్పుడు చేస్తే స్పాంటేనియస్ గా నటించవచ్చని అంటున్న కృతిక.. ఓ కేరక్టర్ చేసిన తర్వాత ఇక దాని గురించి ఆలోచించనని తేల్చేసింది. ప్రస్తుతం ఓ కమెడియన్ పక్కన ఆఫర్ ని అంగీకరించనుందనే వార్తలు వస్తున్నాయి. ఇది నిజమే అన్న కృతిక.. ఈ సినిమా తర్వాత కమెడియన్ పక్కన హీరోయిన్ పాత్రలపై ఉన్న అపోహలను జనాలు పోగొట్టుకుంటారని అంటోంది. అంటే రోజులు మారాల్సిందే అని చెబుతోందన్నమాట.