Begin typing your search above and press return to search.
అర్జున్ రెడ్డి`తో ఆ నిర్మాతకు చిక్కులు!
By: Tupaki Desk | 1 July 2018 9:46 AM GMT`అర్జున్ రెడ్డి` సినిమాతో హీరో విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో విజయ్ నటనకు టాలీవుడ్ లోని ప్రముఖ దర్శక నిర్మాతలతో పాటు విమర్శకులు కూడా ఫిదా అయ్యారు. దీంతో, విజయ్ తో సినిమా చేసేందుకు కొందరు నిర్మాతలు క్యూ కట్టారు. ప్రస్తుతం విజయ్....యూవీ క్రియేషన్స్ - గీతా ఆర్ట్స్ బ్యానర్ లో `టాక్సీ వాలా`షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత నోటా చిత్రం చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో విజయ్ ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు. అయితే, విజయ్ ....ఆ సంస్థ అధినేత కె. ఎస్. రామారావును తెగ ఇబ్బంది పెట్టేస్తున్నాడట. విజయ్ పక్కన హీరోయిన్ ను సెట్ చేసేందుకు రామారావు గట్టిగా ట్రై చేస్తున్నా ఎవరూ సెట్ అవడం లేదని టాలీవుడ్ టాక్.
చాలా కాలం తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ నుంచి ఓ సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. కరుణాకరన్ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా `తేజ్ ఐ లవ్ యూ` చిత్రాన్ని కేఎస్ రామారావు తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను కే ఎస్ రామారావు ప్లాన్ చేశారు. అయితే, ఈ సినిమాలో విజయ్ కు జతగా నటించే హీరోయిన్ కోసం ఆయన తెగ వెతుకుతున్నారట. ఇందులో విజయ్ సరసన నటించేందుకు ఇప్పటికే 5గురు హీరోయిన్లకు ఆడిషన్ కూడా చేశారట. కానీ, ఎవరూ సెట్ కాలేదట. అయినా, పట్టువదలకుండా....హీరోయిన్ల వేట కొనసాగిస్తున్నారట. అయితే, ఈ తరం హీరోలు....ప్రొఫెషనల్ గా ఉన్నారని....తామ ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉండేలా చూస్తున్నారని రామారావు హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.