Begin typing your search above and press return to search.
పదేళ్ల తర్వాత 'రానా' పై చర్చ
By: Tupaki Desk | 24 Sep 2020 12:00 PM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ దాదాపు పదేళ్ల క్రితం 'రానా' అనే సినిమాను కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మొదలు పెట్టారు. భారీ బడ్జెట్ తో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకునే హీరోయిన్ గా అమితాబచ్చన్ కీలక పాత్రలో ఆ సినిమాను అనుకున్నారు. స్క్రిప్ట్ వర్క్ అంతా పూర్తి అయ్యి షూటింగ్ కూడా మొదలు పెట్టిన తర్వాత 'రానా' సినిమా రజినీకాంత్ అనారోగ్య కారణాల వల్ల ఆగిపోయింది. రానా సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజే రజినీకాంత్ అస్వస్థతకు గురి అయ్యారు. ఆ సమయంలో దాదాపు ఏడాది పాటు రజినీకాంత్ సినిమాలకు దూరంగా ఉన్నారు.
రజినీకాంత్ పూర్తి ఆరోగ్యవంతంగా మారిన తర్వాత కూడా 'రానా' గురించి ఆలోచించలేదు. ఎందుకంటే రానా సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉండటంతో పాటు చాలా కష్టతరమైన మూడు పాత్రలను చేయాల్సి ఉంది. అందుకే రానా సినిమా షూటింగ్ కు వెళ్లాలని రజినీకాంత్ భావించలేదు. డాక్టర్ల సలహా మేరకు రానా సినిమాను రజినీకాంత్ పక్కకు పెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు ఆ సినిమాకు సంబంధించిన చర్చ జరుగుతోంది. టెక్నాలజీ బాగా పెరిగింది. రజినీకాంత్ ను ఎక్కువ కష్టపెట్టకుండా సినిమాను ముగించేయాలని దర్శకుడు కేఎస్ రవికుమార్ ప్లాన్ చేస్తున్నాడట.
17వ శతాబ్దానికి చెందిన ఆ కథ రజినీకాంత్ కు చాలా నచ్చింది. అందుకే రవికుమార్ ఇటీవల సంప్రదిస్తే చేద్దాం అన్నట్లుగా సంకేతాలు ఇచ్చాడట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయిన తర్వాత రజినీకాంత్ 'రానా' సినిమాను చేసే అవకాశం ఉందని తమిళ మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే హీరోయిన్ గా దీపిక పదుకునే నటించేనా గతంలో అనుకున్నట్లుగా అమితాబచ్చన్ నటించేది అనుమానమే.