Begin typing your search above and press return to search.
ఒకటి సెన్సేషనల్ హిట్..ఇంకోటి సర్ ప్రైజ్ హిట్
By: Tupaki Desk | 28 Feb 2016 5:30 PM GMTటాలీవుడ్లో ప్రస్తుతం చిన్న సినిమాల క్లియరెన్స్ సేల్ నడుస్తోంది. పరీక్షల సీజన్ కావడంతో పెద్ద సినిమాలన్నీ పక్కకు తప్పుకోవడంతో చాన్నాళ్లుగా రిలీజ్ కు నోచుకోని చాలా సినిమాల్ని ఈ టైంలో థియేటర్లలోకి వదిలేస్తున్నారు. రెండు కాదు.. మూడు కాదు.. ఏకంగా ఏడు సినిమాలు వచ్చాయి. అందులో యమపాశం, గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్ డబ్బింగ్ సినిమాలు కాగా.. మిగతా ఐదూ తెలుగు సినిమాలే. ఈ డబ్బింగ్ సినిమాలు రెంటికీ కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ లేదు. యమపాశం గురించి ఏదో అనుకున్నారు కానీ.. ఈ సినిమా ఇంకేదోలా అనిపించింది. జయం రవికి ఇక్కడ మార్కెట్ కూడా లేకపోవడంతో ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్.. ఆ తరహా ప్రేక్షకులతో ఏదో అలా నడుస్తోంది.
ఇక తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ఐదింట్లో ఓ మోస్తరు అంచనాల మధ్య రిలీజైనవి క్షణం - పడేసావె. టెర్రర్ - ఎలుకా మజాకా - వీరి వీరి గుమ్మడిపండు సినిమాలపై ఎలాంటి అంచనాల్లేవు. పడేసావె సినిమాకు మంచి పబ్లిసిటీ చేశారు.. నాగార్జున ఈ సినిమా గురించి చాలా చెప్పాడు కానీ.. సినిమా అనుకున్నట్లుగా లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. బ్రహ్మానందం - వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎలుకా మజాకా’ ప్రేక్షకుల్ని థియేటర్ల వరకు రప్పించలేకపోయింది. వీరి వీరి గుమ్మడిపండు సినిమాను పట్టించుకునే నాథుడు లేడు. ఇక ఈ వారం వచ్చినవాటిలో క్షణం - టెర్రర్ జనాల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. క్షణం మీద మంచి అంచనాలే ఉన్నాయి కానీ.. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అనూహ్యం. అందరూ క్షణం గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతుండటంతో సినిమా అంచనాల్ని మించి సెన్సేషనల్ హిట్టయ్యేలా కనిపిస్తోంది. ఇక ఏమాత్రం అంచనాల్లేకుండా వచ్చిన ‘టెర్రర్’ సినిమా ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా సర్ ప్రైజ్ హిట్ అని చెప్పొచ్చు. చూసిన వాళ్లంతా బాగుందంటున్నారు. కాకపోతే దీనికి చాలా తక్కువ థియేటర్లిచ్చారు. సరిగా పబ్లిసిటీ కూడా చేయలేదు. మంచి టాక్ వచ్చినా దాన్ని కూడా సరిగా ఉపయోగించుకోవట్లేదు. పబ్లిసిటీ బాగా చేసి, థియేటర్లు పెంచితే పెట్టుబటి రాబట్టుకునే అవకాశాలున్నాయి.