Begin typing your search above and press return to search.
3 రోజుల్లో మొత్తం పిండేసిన క్షణం
By: Tupaki Desk | 29 Feb 2016 7:02 AM GMTఅడివి శేష్ - ఆదా శర్మ - అనసూయలు నటించిన క్షణం మూవీ.. సంచలనానికి వేదికైంది. అతి తక్కువ పెట్టుబడితో, అత్యంత క్వాలిటీతో తెరకెక్కిన క్షణం.. పెట్టుబడి మొత్తాన్ని మూడంటే మూడు రోజుల్లోనే రాబట్టగలిగింది. కేవలం ఒకకోటీ 10లక్షల రూపాయల బడ్జెత్ తెరకెక్కిన క్షణం.. వీకెండ్ వచ్చేసరికే ఆ మొత్తాన్ని వసూలు చేసేసింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు, యూఎస్ - కర్నాటక - చెన్నై కలెక్షన్స్ కలుపుకుంటే.. తొలి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కి వచ్చేసింది క్షణం. ఇప్పటికే సూపర్ టాక్ స్ప్రెడ్ అవడంతో మౌత్ పబ్లిసిటీ కూడా ఎక్కువగానే లభిస్తోంది. ఈవారం విడుదలైన సినిమాల్లో ఏదీ నిలబడలేకపోవడం కూడా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. పీవీపీ బ్యానర్ నుంచి చాలా రోజుల సక్సెస్ రావడంతో.. నిర్మాత కూడా చాలా హ్యాపీగా ఉన్నారనే చెప్పాలి. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన క్షణం మూవీకి వచ్చిన ఆదరణ చూస్తుంటే.. తెలుగులో ఇలాంటి సినిమాల అవసరాన్ని, ఒకవేళ రిలీజ్ అయితా వచ్చే రిజల్ట్ కు సాక్ష్యంగా నిలచించీద సినిమా.
తెలుగులో కొత్త కాన్సెప్టులు రావనే ఆరోపణలను తిప్పికొట్టిందీ సినిమా. ప్రయోగాలు చేసి, అతి చిన్న బడ్జెట్ తో.. అద్భుతమైన విజయాలు అందుకోవచ్చని ప్రూవ్ చేసింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇంత తక్కువ బడ్జెట్ ఇంత క్వాలిటీ మూవీ తీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.