Begin typing your search above and press return to search.
క్షణం రీమేక్.. కొట్టేలాగే ఉందే
By: Tupaki Desk | 20 Jun 2017 7:12 AM GMTపోయినేడాది తెలుగులో పెద్దగా అంచనాల్లేకుండా విడుదలై సెన్సేషనల్ హిట్టయిన చిన్న సినిమా.. క్షణం. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని ప్రమాణాలతో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీని తెలుగు ప్రేక్షకులు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మన ప్రేక్షకులకు ఈ సినిమా ఒక సరికొత్త అనుభూతిని పంచింది. ఈ చిత్రం పొరుగు ఇండస్ట్రీల్ని కూడా బాగానే ఆకర్షించింది. హిందీతో పాటు తమిళంలోనూ రీమేక్ హక్కులు మంచి రేటుకు అమ్ముడయ్యాయి. హిందీలో ఇంకా రీమేక్ మొదలవ్వలేదు కానీ.. తమిళంలో మాత్రం సినిమా పూర్తయింది. విడుదలకు కూడా సిద్ధమైంది. ‘సత్య’ పేరుతో తెరకెక్కిన క్షణం రీమేక్.. జులైలోనే విడుదల కాబోతోంది. దీని ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.
రెండు నిమిషాల నిడివి ఉన్న ‘సత్య’ ట్రైలర్ చూస్తే.. ‘క్షణం’ సినిమాను దాదాపుగా అలాగే దించేశారని అర్థమవుతోంది. కానీ తమిళంలోనూ సినిమా ఎఫెక్టివ్ గానే తయారైనట్లు అనిపిస్తోంది. రీమేక్ అన్న ఆలోచన వదిలేసి చూస్తే ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ట్రైలర్ ఆసక్తి రేకెత్తించేలా కట్ చేశారు. తమిళ ప్రేక్షకులు సినిమాను బాగానే ఓన్ చేసుకునేలా కనిపిస్తోంది ‘సత్య’ ట్రైలర్. హీరో పాత్రలో సత్యరాజ్ కొడుకు శిబి సత్యరాజ్ ఓకే అనిపిస్తున్నాడు. అతడికి జోడీగా నటించిన రమ్య నంబీశన్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అయ్యేలా ఉంది. అనసూయ క్యారెక్టర్ని శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి చేసింది. సత్యం రాజేష్ చేసిన పోలీసాఫీసర్ పాత్రను సీనియర్ నటుడు ఆనంద్ రాజ్ చేయడం విశేషం. రవివర్మ తెలుగులో చేసిన క్యారెక్టరే తమిళంలోనూ చేస్తున్నాడు. ‘బేతాళుడు’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/