Begin typing your search above and press return to search.

పద్మావతి లొల్లిలో ప్రభాస్ కావాలట

By:  Tupaki Desk   |   21 Nov 2017 7:50 AM GMT
పద్మావతి లొల్లిలో ప్రభాస్ కావాలట
X
దేశవ్యాప్తంగా ప్రస్తుతం సంచలనంగా మారిన పద్మావతి సినిమా వివాదం ఇప్పట్లో చల్లబడేలా లేదు. సినిమా విడుదల కాకముందే చరిత్రను కించపరిచారని చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. అంతే కాకుండా తలలు తెగుతాయని చిత్ర హీరోయిన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇక దర్శకుడిపై కూడా అదే తరహాలో కామెంట్స్ చేశారు. క్షత్రియ వర్గానికి చెందిన ఎవరైనా వారి తలలను నరికేస్తే నజరానా ఇస్తామని చెప్పారు.

ఒకరు అయిదు కోట్లు ఇస్తామని చెబుతుంటే.. మరొకరు ఏకంగా పది కోట్ల రూపాయలను ఇస్తామని గట్టిగా చెప్పారు. అంతే కాకుండా వారి కుటుంబాలని ఆదుకుంటామని చెప్పారు. దీంతో బాలీవుడ్ లో ప్రస్తుతం ఈ విషయంపై అనేక చర్చలు సాగుతున్నాయి. మొత్తానికి సినిమా రిలీజ్ ని అయితే వాయిదా వేశారు. కానీ ఈ వివాదంపై కొత్తగా ప్రభాస్ పేరు వినిపిస్తోంది. ప్రభాస్ ఫ్యామిలీ రాజుల కుటుంబాలకు చెందినవారే. కృష్ణం రాజు క్షత్రియ వర్గాలతో జరిగే కొన్ని సమావేశాల్లో ఇప్పటికి పాల్గొంటూ ఉంటారు. అయితే ప్రభాస్ ఈ వివాదంపై ఒక డిబేట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ఒక మీడియా ఛానెల్ ఈ కార్యక్రమాన్ని రెడీ చేస్తున్నట్లు టాక్. అయితే ఈ విషయంపై ప్రభాస్ ఏ విధంగా స్పందించిన కొంచెం కష్టమే అని చెప్పాలి. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఈ సమయంలో పద్మావతి వివాదంలో ఇరుక్కోవడం అంతగా మంచిది కాదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి.