Begin typing your search above and press return to search.
శంకర్ సక్సెస్ కి కారణం ఈయనేనట
By: Tupaki Desk | 7 Dec 2017 1:10 PM GMTశంకర్ అంటే ఇప్పుడు కేవలం ఓ దర్శకుడు మాత్రమే కాదు. ట్రెండ్ సెట్టర్.. పాథ్ బ్రేకర్.. లాంటి పదాలు కూడా చిన్నవే అనిపిస్తాయి. ఇండియన్ మూవీ స్థాయిని పెంచడంలో.. ముఖ్యంగా సౌత్ సినిమా రేంజ్ ను పెంచడంలో శంకర్ పాత్ర చాలా కీలకం.
ఇప్పుడు కోట్లు ఖరీదు చేసే రోల్స్ రాయిస్ కారులో తిరుగుతున్న శంకర్.. ఒకప్పుడు అంటే తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసే సమయంలో.. ఆటోలో కానీ పాత స్కూటర్ పై కానీ వచ్చేవాడని.. నిర్మాత కేటీ కుంజుమోన్ అంటున్నాడు. 'అప్పట్లో నేను 5 వేల రూపాయల కట్ట ఇచ్చి ఇది ఐదు కోట్లతో సమానం.. నీకు చాలా భవిష్యత్ ఉంది' అని చెప్పానన్న కుంజుమోన్.. ఇప్పుడు ఆ మాటలు నిజమైనందుకు సంతోషిస్తున్నా అంటున్నాడు.
'పవిత్రన్ దర్శకత్వంలో రూపొందిన వసంతకాల పరవ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయడంతో శంకర్ కెరీర్ ప్రారంభమైంది' అని చెప్పాడు కుంజుమోన్. 'జెంటిల్మన్ హిట్ అయినపుడు రెండు తాళం చెవులు అతనికి ఇచ్చాను. అందులో ఒకటి ఫ్లాట్ కీ అయితే.. రెండోది అప్పట్లో క్రేజీ కార్ అయిన మారుతి 800ది.'అన్నాడు కుంజుమోన్. శంకర్ లోని ట్యాలెంట్ గుర్తించి జెంటిల్ మ్యాన్ సినిమా చేసే అవకాశం ఇచ్చినట్లు చెప్పిన ఈ నిర్మాత.. అతనికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని అంటున్నాడు.
ఇప్పుడు శంకర్ కెరీర్ ఈ స్థాయికి చేరడంలో.. మొదటి సినిమాతోనే శంకర్ కు పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ కల్పించడంలో తన పాత్ర ఉండడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు కుంజుమోన్. జెంటిల్ మ్యాన్ మువీలో ట్రైన్ పై నుంచి బైక్ తో జంప్ చేసే సీన్ బాగుంటుందని కూడా ఈయనే సలహా ఇచ్చాడట.