Begin typing your search above and press return to search.

కేటీఆర్-సమంత.. సభ్య సమాజానికి మెసేజ్

By:  Tupaki Desk   |   12 July 2017 4:27 AM GMT
కేటీఆర్-సమంత.. సభ్య సమాజానికి మెసేజ్
X
మన దేశంలో చేనేత దినోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి.. ఆగస్ట్ 7ను హ్యాండ్ లూమ్ డే గా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మూడవ చేనేత వస్త్రాల దినోత్సవాన్ని నిర్వహించుకోబోతోన్నారు.

తెంలగాణలో ఈ సందడి మరీ ఎక్కువగా కనిపించనుంది. టెక్స్ టైల్ మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు అందరికీ ఒక లేఖ ద్వారా హ్యాండ్ లూమ్ డే గురించి లేఖ రాశారు. ఆ రోజున అందరూ చేనేత వస్త్రాలనే ధరించి.. పబ్లిక్ లోకి రావాలని సూచించారు. ఇలా చేయడం ద్వారా చేనేత కార్మికులకు తగినంత గౌరవం కల్పించాలని తెలిపారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం చేనేత రంగం అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను కూడా వివరించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన సమంత కూడా తన శైలిలో చేనేత ప్రచారం కొనసాగిస్తూనే ఉంది.

సాంప్రదాయ భారతీయ చేనేత వస్త్రాలకు సమంత కల్పిస్తున్న ప్రచారం.. ఈ కాస్ట్యూమ్స్ తోనే ఈమె ప్రపంచానికి హ్యాండ్ లూమ్స్ గొప్పదనం గురించి చెబుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 'చేనేతే భవిష్యత్తు. ఒక మనిషి తయారుచేసిన వస్త్రాలను ధరిస్తే.. అందులో ఏదో ప్రత్యేకత దాగి ఉంటుంది' అంటూ ట్వీట్ చేసింది సమంత. హ్యాండ్ లూమ్స్ ధరించి ఇప్పటికే ఫోటోషూట్స్ కూడా సమంత చేస్తున్న సంగతి తెలిసిందే.