Begin typing your search above and press return to search.
బాహుబలి మళ్లీ కావాలంటున్న కేటీఆర్
By: Tupaki Desk | 6 Dec 2017 9:46 AM GMTకేటీఆర్ అంటే ఇప్పుడు ఓ బ్రాండ్ అయిపోయారు. ఐటీ రంగం నుంచి సినిమా ఫీల్డ్ వరకూ అన్నిటిలోనూ తన మార్క్ చాటుతున్న కేటీఆర్.. హైద్రాబాద్ లో ఇవాంకా ట్రంప్ టూర్ ను దిగ్విజయంగా నిర్వహించి.. మరింతగా తన సత్తా చాటారు.
ఇప్పటికే టీ-హబ్ అంటూ స్టార్టప్స్ కోసం శ్రమిస్తున్న ఈయన.. ఇప్పుడు ఓ ఆకర్షణీయమైన న్యూస్ అందించారు. టీ వర్క్స్ అంటూ దేశంలోనే అతి పెద్ద మేకర్ స్పేస్.. డిజైన్ సెంటర్ హైద్రాబాద్ కు వస్తోందని చెప్పారు కేటీఆర్. మరో ఏడాది కాలంలో 20 మిలియన్ డాలర్ల విలువైన ఎక్విప్మెంట్ వస్తోందని కూడా కేటీఆర్ చెప్పడం.. అందరినీ ఆకట్టుకుంది. సినిమా రంగాన్ని అయితే.. తెగ ఆకర్షించేసింది. బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ.. కేటీఆర్ ట్వీట్ పై స్పందించారు. 'ఇదో అత్యద్భుతమైన కార్యక్రమం. తమ ఆలోచనలకు ప్రజలు మరింతగా పదును పెట్టేందుకు సహకరిస్తుంది' అంటూ ట్వీట్ చేశారు శోభు.
బాహుబలి ప్రొడ్యూసర్ కు రిప్లై ఇస్తూ 'థాంక్స్ శోభు.. టీ వర్క్స్ ను ఉపయోగించి బాహుబలి3 ని మీరు సాధ్యం చేయగలరని భావిస్తున్నా' అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం విశేషం. బాహుబలి సాధించిన ఘన విజయం.. దేశం మొత్తాన్ని హైద్రాబాద్ వైపు చూసేలా చేసింది. ఇప్పుడు బాహుబలి3 అంటూ కేటీఆర్ లాంటి ప్రముఖ రాజకీయ నేత ట్వీట్ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది.