Begin typing your search above and press return to search.

నేను మ‌హేష్ అయితే...ఆ లుక్ ట్రై చేస్తా: కేటీఆర్

By:  Tupaki Desk   |   28 April 2018 8:03 AM GMT
నేను మ‌హేష్ అయితే...ఆ లుక్ ట్రై చేస్తా: కేటీఆర్
X
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, విల‌క్ష‌ణ దర్శకుడు కొరటాల శివల కాంబోలో తెర‌కెక్కిన `భ‌ర‌త్ అనే నేను` సినిమా మంచి టాక్ తో రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకుపోతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాపై సామాన్య ప్రేక్ష‌కుల‌నుంచి సెల‌బ్రిటీల‌వ‌ర‌కు అంద‌రూ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కూడా ఫిదా అయ్యారు. దీంతో, కొర‌టాల శివ‌, మ‌హేష్ ల‌తో క‌లిసి కేటీఆర్ ఓ ఇంట‌రాక్టివ్ సెష‌న్ ను ఏర్పాటు చేశారు. ఆ సెష‌న్ లో వివిధ రంగాల‌కు చెందిన యువ‌త పాల్గ‌న్నారు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ ను కేటీఆర్ ఇంట‌ర్వ్యూ చేశారు. ఆ త‌ర్వాత ఒక‌రి రోల్స్ ను ఒక‌రు ఛేంజ్ చేసుకొని ...ఒక‌రి ప్లేస్ లో మ‌రొకరుంటే ఏమి చేస్తారంటూ ప్ర‌శ్నించుకున్నారు. కేటీఆర్, మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా సంభాష‌ణను ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన వారిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

ఆ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా మహేష్, కేటీఆర్ లు ఒక‌రి పాత్ర‌లోకి మ‌రొక‌రు ప‌ర‌కాయ ప్ర‌వేశం చేశారు. ఒక‌వేళ మీరే మ‌హేష్ బాబు అయితే....ఏం చేస్తారు అన్న ప్ర‌శ్న‌కు కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. తాను వెంట‌నే హాలిడే ట్రిప్ కు వెళ్తాన‌ని కేటీఆర్ జ‌వాబిచ్చారు. అంతేకాకుండా..తాను మహేష్ అయితే ఓ సరికొత్త లుక్ లో కనిపించేందుకు ట్రై చేస్తానన‌ని, రస్టిక్‌గా.. డ్రమేటికల్లీ డిఫరెంట్.. ఆబ్సిల్యూట్ గా ఇప్పటి వరకూ ట్రై చేయని లుక్ ను ట్రై చేస్తాన‌ని కేటీఆర్ అన్నారు. తాను సంవ‌త్స‌ర‌న్న‌ర క‌ష్ట‌ప‌డి సినిమా చేశాన‌ని....పొలిటీషియ‌న్ గా కేటీఆర్ ప‌ని కూడా కష్టమైంద‌ని....అందుకే ఆయ‌న‌తో కలిసి హాలిడేకి వెళ్లడానికి ఇష్టపడతాన‌ని మహేష్ అన్నాడు. కేటీఆర్ గారు చెప్పిన డిఫ‌రెంట్ లుక్స్ త‌న నెక్ట్స్ ఫిల్మ్‌లో చేస్తున్నాన‌ని మహేష్ అన్నాడు. ఇలా స‌ర‌దాగా సాగిన ఈ ఇద్ద‌రి సంభాష‌ణ అక్క‌డున్న యువతీయువ‌కుల‌ను ఆక‌ట్టుకుంది.