Begin typing your search above and press return to search.
మంచి ఆఫర్ పట్టేసిన మల్లేశం
By: Tupaki Desk | 16 Jun 2019 4:50 AM GMTవచ్చే 21న విడుదల కాబోతున్న మల్లేశం మీద పాజిటివ్ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు మీడియా ప్రతినిధులు పరిశ్రమ ప్రముఖులకు షో వేసి మంచి రెస్పాన్స్ దక్కించుకున్న టీం నిన్న టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఅర్ కు సినిమాను ప్రదర్శించింది. దీని తర్వాత ఆయన మాట్లడుతూ పద్మశ్రీ చింతకింది మల్లేశం కథను అద్భుతంగా తెరకెక్కించారని చేనేత పరిశ్రమలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టిన ఇలాంటి వ్యక్తుల కథలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని యూనిట్ సభ్యులను ప్రత్యేకంగా ప్రశంశడం విశేషం.
చింతకింది మల్లేశంకు గతంలో రెండో యూనిట్ కోసం తెలంగాణా ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేయడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అంతే కాదు జౌళి శాఖకు 70 కోట్లు ఉన్న నిధుల కేటాయింపుని 1270 కోట్లకు పెంచడాన్ని బట్టి తమ ప్రభుత్వం జౌళి నేతల ఉన్నతి పట్ల ఎంత ఉన్నతాశయంతో ఉందొ ప్రత్యేకంగా చెప్పారు
ఇదంతా ఒక ఎత్తు అయితే మల్లేశంకు పన్ను రాయితీ ఇప్పించే ప్రయత్నాలు చేస్తానని కేటిఅర్ హామీ ఇవ్వడం యూనిట్ ని ఆనందంలో ముంచెత్తుతోంది. ఒకవేళ అదే అమలు జరిగితే నిర్మాతకు బడ్జెట్ పరంగా ఉపయుక్తంగా ఉండటంతో పాటు ఎక్కువ ప్రేక్షకులకు సినిమా చూసే వెసులుబాటు కలుగుతుంది. గతంలో రుద్రమదేవి గౌతమిపుత్ర శాతకర్ణి ఈ సౌలభ్యాన్ని అందుకున్నాయి.
ఒకవేళ మల్లేశంకు అనుమతులు జారీ అయితే మరో ఘనత తోడవుతుంది. అయితే ఇది తెలంగాణాకే పరిమితం. ఆంధ్ర ప్రదేశ్ లో మల్లేశంకు రాయితీ దక్కే అవకాశం లేదు. రాజ్ దర్శకత్వం వహించిన మల్లేశంలో ప్రియదర్శి టైటిల్ రోల్ పోషించగా అనన్య హీరొయిన్ గా ఝాన్సీ హీరో తల్లిగా కీలక పాత్రలలో కనిపిస్తారు. సురేష్ సంస్థ సమర్పణలో వచ్చే శుక్రవారమే మల్లేశం ధియేటర్లలో అడుగు పెట్టనున్నాడు