Begin typing your search above and press return to search.
ఈ నగరానికి ఏమైంది.. కేటీఆర్ నే మోసం చేసింది
By: Tupaki Desk | 26 Jun 2018 4:17 AM GMTసురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కొత్తగా రిలీజవుతున్న చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’. పెళ్లిచూపులు ఫేం డైరెక్టర్ తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ లో అంతా కొత్తవాళ్లే నటించారు. ఈ సినిమా టీం తనను మోసం చేసిందంటూ తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కాస్తంత ఫీలయ్యారు. ఈ మాట ఆయనంత సీరియస్ గా ఏమీ అనలేదు. కాస్తంత ఫన్నీగానే అన్నారు.
ఈ నగరానికి ఏమైంది ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా కేటీఆర్.. రానా అటెండయ్యారు. చేనేత ను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి సోమవారం తామంతా చేనేత దుస్తులనే ధరిస్తున్నామని.. ఈ ఈవెంట్ సోమవారమే జరుగుతోంది కాబట్టి అంతా చేనేత దుస్తులే వేసుకురావాలని కేటీఆర్ ముందే కండిషన్ పెట్టారట. అందుకే నిర్వాహకులు ఓకే అన్నారు. తీరా ఈవెంట్ కు వచ్చి చూస్తే కొంతమందే చేనేత దుస్తుల్లో కనిపించారు. ‘‘ఈ ఫంక్షన్ కు అంతా చేనేత దుస్తులే ధరించి రావాలన్నాను. కాకపోతే ఇక్కడ చీటింగ్ జరిగింది. కొంతమందే ఆ దుస్తుల్లో కనిపిస్తున్నారు. అయినా ఓకే. కొందరైనా ప్రోత్సహిస్తున్నందుకు ఆనందంగా ఉంది” అంటూ నవ్వేశారు కేటీఆర్.
షార్ట్ ఫిలిం తీయడం మరీ అంత ఈజీ ఏమీ కాదు. దానికి ఉండాల్సిన ఇబ్బందులు దానికి ఉన్నాయి. ఇదే కాన్సెప్ట్ తో తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమా తీశాడు. ఈ మూవీలో హీరోగా విష్వక్సేన్ నటించగా హీరోయిన్ గా అనీషా ఆంబ్రోస్ నటించింది.