Begin typing your search above and press return to search.

మహేష్‌ ను కేటీఆర్ ఇంట‌ర్వ్యూ చేస్తే ఇలా ఉంటుంది

By:  Tupaki Desk   |   28 April 2018 11:41 AM IST
మహేష్‌ ను కేటీఆర్ ఇంట‌ర్వ్యూ చేస్తే ఇలా ఉంటుంది
X
మహేష్‌బాబు కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన భరత్ అనే నేను. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఇటీవ‌ల భ‌ర‌త్ అనే నేను చిత్రం స్పెష‌ల్ స్క్రీనింగ్ వీక్షించిన సంగ‌తి తెలిసిందే. చిత్రానికి మంచి టాక్ రావడంతో పాటు థీమ్ గురించి అందరు గొప్పగా మాట్లాడుతుండడంతో కేటీఆర్ ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపారు. సినిమా బాగా నచ్చడంతో తన ట్విట్టర్ లో మహేష్ మరియు కొరటాల శివని అభినందించారు. సినిమా చాలా ఎంజాయ్ చేశానని స్నేహితుడు మహేష్, డైరెక్టర్ కొరటాల శివతో ఇంటరాక్షన్ జరిపినట్టు కేటీఆర్ తన ట్వీట్ ద్వారా తెలిపారు.

మ‌రోవైపు భరత్ అనే నేను చిత్రాన్ని వీక్షించిన కేటీఆర్‌కు మహేష్‌బాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇక `ఈ స్పెష‌ల్ కార్య‌క్ర‌మం కోసం చేనేత వ‌స్త్రాలు మాకు ప‌రిచ‌యం చేసినందుకు ధ‌న్య‌వాదాలు. నేను ప్రోగ్రాంలో ధ‌రించిన ష‌ర్ట్‌పై బోలెడ‌న్ని కాంప్లిమెంట్స్ వ‌స్తున్నాయి. ఈ ష‌ర్ట్ ఎంతో కూల్‌గా ఉండ‌డంతో పాటు స్టైలిష్‌గా, కంఫర్ట‌బుల్‌గా నా శ‌రీరాకృతికి త‌గ్గ‌ట్టుగా ఉంది` అని మ‌హేష్ త‌న ట్వీట్ ద్వారా తెలిపారు. దీనిపై స్పందించిన కేటీఆర్ `చేనేత ప్ర‌మోష‌న్స్ నా హృదయానికి ద‌గ్గ‌రైంది. ఇందుకు స‌పోర్ట్ ఇచ్చిన మ‌హేష్‌, కొర‌టాల శివ‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు.. మీ ఫ్యూచ‌ర్‌ సినిమాల‌లో చాలా స్టైలిష్ మ‌రియు సౌక‌ర్య‌వంత‌మైన హ్యాండ్లూమ్స్‌ని ఉప‌యోగిస్తార‌ని ఆశిస్తున్నాను` అని కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనికి మ‌హేష్‌, కొర‌టాల త‌ప్ప‌కుండా చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఇలా భ‌ర‌త్ అనే నేనుకు సంబంధించిన సినిమాతో మంత్రి కేటీఆర్‌ జ‌ర్నీలో మ‌రో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది.ఈ సినిమా త‌న రియ‌ల్ లైఫ్‌కి కూడా కాస్త ద‌గ్గ‌ర‌గా ఉండ‌డంతో మూవీ హీరో మ‌హేష్ బాబు, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌తో క‌లిసి కేటీఆర్‌ ఇంట‌రాక్ష‌న్ జ‌రిపారు. సినిమాలో ఉన్న అంశాలతో పాటు రియల్ లైఫ్ లో తాను ఫాలో అవుతున్న పద్దతులు గురించి చ‌ర్చించారు. ఆ వీడియో తాజాగా విడుద‌లైంది. మంత్రి కేటీఆర్ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని, చిత్రబృందంతో ఆయన పంచుకున్న అనుభవాల్ని, మ‌హేష్ పంచుకున్న భావాలు ఇంటర్యూ రూపంలో వీడియో ద్వారా విడుద‌ల చేశారు. మరి మీరు ఆ వీడియోపై ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి