Begin typing your search above and press return to search.
సినిమా పోస్టర్లకు ఫిట్టింగ్ పెట్టేశారు
By: Tupaki Desk | 6 Dec 2016 7:30 PM GMTఇప్పుడు హైదరాబాద్ ను డిఫరెంట్ స్టయిల్లో ప్రక్షాళన చేస్తున్నారు మంత్రి కెటిఆర్. ఆయన సినిమా వాళ్లకు ఎంతో క్లోజ్ గా ఉంటున్నప్పటికీ.. ఇప్పుడు సినిమా పోస్టర్లకు మాత్రం ఆయన ఆధీనంలో ఉండే డిపార్టుమెంట్ నుండి పెద్ద పంచే పడేలా ఉంది. పదండి చూద్దాం.
హైదరాబాదులోనే కాదు.. యావత్ భారత దేశంలోనే ఏ ఊళ్ళో చూసినా కూడా.. గోడల మీద ఏదో ఒక అడ్వర్టయిజ్మంట్ కనిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మనోళ్లు సినిమా పోస్టర్లను వెంటనే వేసేస్తారు. కొన్ని చోట్ల వాటర్ కలర్ తో ప్రొడక్ట్ యాడ్లను రాయిస్తారు. హైదరాబాద్ అమీర్ పేట్ వంటి ఏరియాల్లో కొన్ని కోర్సులు నేర్పే కంపెనీలు పోస్టర్లు వేస్తుంటాయి. ఇప్పుడు ఇలాంటివన్నీ బ్యాన్ చేశాం అంటోంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇక మీదట ఎక్కడన్నా గోడల మీద రాతలు రాసినా.. పోస్టర్లు వేసినా కూడా.. ఫైన్ వేస్తారట.
ఆల్రెడీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్లు బోర్డులు పెడితే.. వెంటనే వారికి ఫైన్ వేస్తున్నారు. ఇప్పుడు పోస్టర్లకు కూడా ఆ రూల్ వర్తించేలా చేశారనమాట. మరి చిన్న సినిమాలు ప్రమోట్ చేసుకోవాలంటే.. వేలకు వేలు ఖర్చుపెట్టి హోర్డింగులకు ఎక్కలేరుగా. ఇప్పుడెలా?