Begin typing your search above and press return to search.
'సైరా' ఈవెంట్ కి డైనమిక్ లీడర్ మిస్సింగ్
By: Tupaki Desk | 13 Sep 2019 3:54 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. చిరు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరపైకి వచ్చిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈ వెంట్‌ని ఈ నెల 18న హైదరాబాద్ లో భారీ స్థాయిలో చిత్ర బృందం ప్లాన్ చేసింది. ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా ఈ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. ఈ వేడుకలో `సైరా` థియేట్రికల్ ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా జనసేనాని పవన్‌కల్యాణ్- ఎస్.ఎస్. రాజమౌళి- కోరటాల శివ- వి.వి.వినాయక్‌లతో పాటు తెరాస మంత్రి.. డైనమిక్ లీడర్ కేటీఆర్ రాబోతున్నారని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
అయితే ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే సోషల్ మీడియా ద్వారా ఈ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనడం లేదని ప్రకటించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అధికారిక కార్యక్రమాల్లో బిజీగా వుండటం వల్ల కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నారని ప్రకటించారు. రామ్ చరణ్ - కేటీఆర్ చాలా కాలంగా అత్యంత సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ సినిమాలపై ట్విట్టర్ ద్వారా స్పందించే కేటీఆర్ `సైరా` ఈవెంట్ కి ఖచ్చితంగా హాజరవుతాడని మెగా ఫ్యాన్స్ భావించారు. కానీ చివరి నిమిషంలో కేటీఆర్ షెడ్యూల్ మారడంతో ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతుండటం మెగా ఫ్యాన్స్ ని కొంత నిరాశపరిచిందట.
ఎల్బీ స్టేడియంలో జరిగే ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున రానున్నారని తెలుస్తోంది. దాదాపు లక్ష మంది పైగా ఫ్యాన్స్ ఈ ఈవెంట్ కి అటెండయ్యే అవకాశం ఉందని రివీలైంది. అందుకు తగ్గట్టే భారీ పోలీస్ భద్రత నడుమ ఈ వేడుకను నిర్వహించనున్నారట. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుంది.