Begin typing your search above and press return to search.

మహేష్ మూవీపై కేటీఆర్ పవర్ఫుల్ డైలాగ్

By:  Tupaki Desk   |   28 April 2018 11:07 AM IST
మహేష్ మూవీపై కేటీఆర్ పవర్ఫుల్ డైలాగ్
X
మహేష్ బాబు మూవీ భరత్ అనే నేను మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి మరీ.. మూవీ యూనిట్ ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన మాటలు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉన్నాయి.

ఇవాల్టి రోజుల్లో మీడియా వ్యవహరిస్తోందన్న తీరుపై ఆందోళన వెలిబుచ్చిన కేటీఆర్.. తాము రోజు పడే బాధలను కూడా ఆన్ స్క్రీన్ పై చూపించినందుకు దర్శకుడు కొరటాలకు ధన్యవాదాలు తెలిపారు. మీడియాలో ఎక్కడో ఒక లెక్కలేనితనం కనిపిస్తోందన్న ఆయన.. మంచి పని చేస్తే ఏ తరహా ప్రచారం ఉండదనే విషయాన్ని గుర్తు చేశారు. 'అదేదో అంటారు కదా.. మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు.. మనిషే కుక్కని కరిస్తే వార్త. ఇలా ఒక దాన్నే ఫోకస్ చేయడం.. ఓ మనిషి ఒకసారి దూకితే.. 50 సార్లు అదే చూపించడం లాంటివి చేస్తున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను పాయింట్ చేశారు. వ్యవస్థకు నాలుగు స్తంభాలు అయిన వాటిని చక్కగా చూపించినందుకు.. హృదయపూర్వక ధన్యవాదాలు' అన్నారు కేటీఆర్.

ఇక చివరలో భరత్ అనే నేను సినిమా టైటిల్ ను బేస్ చేసుకుని కేటీఆర్ పేల్చిన పంచ్ డైలాగ్ అయితే అదరహో అనాల్సిందే. ప్రతీ ఒక్కరూ ముఖ్యమంత్రి అయిపోలేరు అని.. 29 రాష్ట్రాలుండగా.. అందరూ ముఖ్యమంత్రి అవాలంటే.. వేరే పనులు ఏమీ జరగవ్ అన్న కేటీఆర్.. 'అలా కాకుండా.. భరత్ అనే నేను సినిమా చూసి.. భారత్ అనే నా దేశం కోసం.. నా వంతు పాత్ర నేను పోషిస్తాను.. పౌరుడిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను.. నిర్వర్తిస్తాను అని ఎవరైనా అనుకుంటే.. కనీసం వన్ పర్సంట్ ఛేంజ్ అందుకున్నట్లే' అని చెప్పడం హైలైట్.