Begin typing your search above and press return to search.
హలో గురూ.. మంత్రిగారికి సినిమా నచ్చిందట
By: Tupaki Desk | 20 Oct 2018 11:00 AM GMTతెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు సినిమాలపై బాగా ఆసక్తి ఉంది. ఆయన తరచుగా థియేటరుకెళ్లి సినిమాలు చూస్తుంటారు. సినీ హీరోలు చాలామందితో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. అప్పుడప్పుడూ సినిమా చూసి తన అభిప్రాయాల్ని ట్విట్టర్లో పంచుకుంటూ ఉంటాడు కేటీఆర్. ఐతే ఒక సందర్భంలో ఏదో సినిమా చూసి ట్వీట్ చేస్తే.. మంత్రి అయిన మీరు సినిమాలు చూస్తూ టైంపాస్ చేయడం ఏంటి అని ఒక నెటిజన్ ప్రశ్నించాడు. ఐతే సినిమాలంటే తనకు ఆసక్తి అని.. మంత్రి అయినంత మాత్రాన తనకు వ్యక్తిగత జీవితం ఉండదా.. అభిరుచులు ఉండవా అంటూ గట్టిగా క్లాస్ పీకాడు కేటీఆర్. ఐతే సాధారణ సమయాల్లో సినిమాలు చూడటం మామూలే కానీ.. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల వాతావరణం నెలకొన్న సమయంలోనూ కేటీఆర్ ఓ సినిమా చూసి దాని గురించి ట్వీట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తోంది.
శుక్రవారం కేటీఆర్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ సినిమా చూశారు. పండగ రోజు తనకు సినిమా చూసే అవకాశం లభించిందని.. ఈ సినిమా క్లీన్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. హీరో రామ్ తో పాటు ప్రకాష్ రాజ్.. అనుపమ పరమేశ్వరన్ చాలా చక్కగా నటించారని కితాబిచ్చారు కేటీఆర్. ఐతే ఓవైపు తెలంగాణలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల హడావుడిలో మునిగిపోయి ఉన్నాయి. అధికార టీఆర్ ఎస్ సైతం ఎన్నికల వ్యూహరచనలో.. ప్రచారంలో చాలా బిజీగా ఉంది. ఇక పార్టీలో అత్యంత కీలకమైన నేతల్లో ఒకరైన కేటీఆర్ సంగతి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి టైంలోనూ ఆయన సినిమా చూసేందుకు వీలు చేసుకోవడం విశేషమే. కాకపోతే ‘అరవింద సమేత’ లాంటి పెద్ద సినిమా ఉండగా.. కేటీఆర్ ‘హలో గురూ ప్రేమ కోసమే’ చూశారు. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించి.. దానికి బూస్ట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.